Gandhi Hospital Jobs: నెలకు లక్షకుపైగా జీతంతో.. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్‌లో 135 ఉద్యోగాలు..!

తెలంగాణ రాష్ట్రానికి చెందిన సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీ/గాంధీ హాస్పిటల్ .. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల (Assistant Professor Posts)భర్తీకి..

Gandhi Hospital Jobs: నెలకు లక్షకుపైగా జీతంతో.. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్‌లో 135 ఉద్యోగాలు..!
Gandhi Hospital
Follow us

|

Updated on: Mar 21, 2022 | 8:34 PM

Telangana Gandhi Medical Hospital Recruitment 2022: తెలంగాణ రాష్ట్రానికి చెందిన సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీ/గాంధీ హాస్పిటల్ .. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల (Assistant Professor Posts)భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 135

పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు

  • అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు: 115

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 44 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో ఇంటర్ (10+2), బ్యాచిలర్స్ డిగ్రీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ పూర్తి చేసి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంతో అనుభవం కూడా ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.1,25,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

  • సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు: 20

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 44 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయ్యి ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.52,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: The superintendent, Gandhi Hospital, Musheerabad, secunderabad.

దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 5, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

PGIMER Recruitment 2022: ఇంటర్/డిగ్రీ అర్హతతో.. పీజీఐఎమ్ఈఆర్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!