AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Engineering Fee: తెలంగాణ ఎంసెట్‌-2022లో సీట్లు పొందిన విద్యార్ధులకు అలర్ట్‌! ‘పెరిగిన ఫీజు కాలేజీల్లో నేరుగా చెల్లించాలి’

తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త ఫీజులకు సంబంధించిన జీవో రాష్ట్ర సర్కార్‌ తాజాగా విడుదల చేసింది. తాజా జీవో ప్రకారం బీటెక్‌ కోర్సుకు ఒక్కోకాలేజీకి ఒక్కో విధంగా మొత్తం 159 కాలేజీల్లో ఫీజులు పెరిగాయి. ఐతే ఇప్పటికే సీట్లు పొందిన..

TS Engineering Fee: తెలంగాణ ఎంసెట్‌-2022లో సీట్లు పొందిన విద్యార్ధులకు అలర్ట్‌! 'పెరిగిన ఫీజు కాలేజీల్లో నేరుగా చెల్లించాలి'
Telangana engineering fee hiked
Srilakshmi C
|

Updated on: Oct 22, 2022 | 11:32 AM

Share

తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త ఫీజులకు సంబంధించిన జీవో రాష్ట్ర సర్కార్‌ తాజాగా విడుదల చేసింది. తాజా జీవో ప్రకారం బీటెక్‌ కోర్సుకు ఒక్కోకాలేజీకి ఒక్కో విధంగా మొత్తం 159 కాలేజీల్లో ఫీజులు పెరిగాయి. ఐతే ఇప్పటికే సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లోనే పెరిగిన మేరకు ఫీజులు చెల్లించాలని జీవోలో పేర్కొంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ వర్గాలు స్పష్టం చేశాయి. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా ఇప్పటి వరకు సీట్లు పొందిన విద్యార్థులు గతేడాది ఫీజులను ఆన్‌లైన్‌లో చెల్లించిన సంగతి తెలిసిందే. కొన్ని కాలేజీలు మినహా అధిక శాతం కాలేజీల్లో ఫీజులు పెరిగాయి. పెరిగిన మొత్తం రూ.3 వేల నుంచి రూ.52 వేల వరకు ఉంది. అధిక కాలేజీల్లో రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు పెరిగింది.

ఇప్పటికే తెలంగాణ ఎంసెట్‌-2022 రెండో రౌండ్‌ కౌన్సెలింగ్‌ కూడా ముగిసింది. దీంతో ఇప్పటి వరకు దాదాపు 64,134 మందికి సీట్లు పొందారు. వీరిలో 50 వేల మంది వరకు ఆయా కాలేజీల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉంది. ఈ విద్యార్థులంతా పెరిగిన ఫీజు మొత్తాన్ని సీట్లు పొందిన కాలేజీల్లో నేరుగా చెల్లించాలని కమిటీ వర్గాలు తెలిపాయి. అంటే ఒక విద్యార్థి తనకు సీటు లభించిన కాలేజీ పాత ఫీజు ప్రకారం రూ.లక్ష ఉన్నందున ఆ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో కన్వీనర్‌కు చెల్లించి ఉంటే.. తాజా జీవోతో ఆ కాలేజీ ఫీజు రూ. లక్ష 20 వేలకు పెరిగిందనుకోండి. అదనంగా పెరిగిన రూ.20 వేలను కాలేజీలో చేరిన తర్వాత యాజమన్యానికి చెల్లించవల్సి ఉంటుంది.

ఇక ఎంసెట్‌ చివరి విడత సీట్ల కేటాయింపు మిగిలి ఉండగా.. ఈ రౌండ్‌లో సీట్లు పొందే విద్యార్ధులకు ఈ విషయాన్ని అలాట్‌మెంట్‌ లెటర్‌లో పొందుపరుస్తామని అధికారులు తెలిపారు. చివరి విడతలో కూడా పాత రుసుములను కన్వీనరుకు చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా పెరిగిన ఫీజును కాలేజీల్లో చెల్లించవచ్చని అధికారులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో