Telangana EAMCET 2021: తెలంగాణ ఎంసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా..

Telangana EAMCET 2021: తెలంగాణ ఎంసెట్‌-2021 పరీక్షకు ఇంకా దరఖాస్తు చేయని వారికి శుభవార్త. ఎంసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు పొడిగించారు. ఈ మేరకు ఆలస్య రుసుము..

Telangana EAMCET 2021: తెలంగాణ ఎంసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా..
Follow us
Subhash Goud

|

Updated on: May 17, 2021 | 8:49 PM

Telangana EAMCET 2021: తెలంగాణ ఎంసెట్‌-2021 పరీక్షకు ఇంకా దరఖాస్తు చేయని వారికి శుభవార్త. ఎంసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు పొడిగించారు. ఈ మేరకు ఆలస్య రుసుము లేకుండా ఈనెల 26వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించవచ్చని తెలంగాణ ఎంసెట్‌ కన్వీనర్‌ ఆచార్య ఎ. గోవర్ధన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

ఎంసెట్ పరీక్షలు జూలై 5 – 9 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) మోడ్‌లో జరుగుతాయి. పరీక్షలు మొత్తం 9 సెషన్లలో జరుగుతాయి. అగ్రికల్చర్‌ వారికి 3, ఇంజినీరింగ్‌ వారికి 5 సెషన్లు, మరో సెషన్‌ను అవసరాన్ని బట్టి నిర్వహించాలనుకుంటున్నామని ఆయన తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు జరుగుతాయి.

ఇవీ చదవండి

నిరుద్యోగులకు సువర్ణావకాశం.. 3479 టీచర్ పోస్టులు.. మే31 చివరి తేదీ.. దరఖాస్తు చేసుకోండి ఇలా..?

Google Assistant: గూగుల్ అసిస్టెంట్ నుంచి త్వరలోనే కొత్త అప్‌డేట్ .. రంగు రంగుల రూపంలో డార్క్‌ థీమ్‌

Bank Services: బ్యాంకు కస్టమర్లకు హెచ్చరిక.. ఆ రోజు ఆన్‌లైన్‌లో డబ్బులు పంపడం కుదరదు.. ఆర్బీఐ కీలక ప్రకటన