TS DME Recruitment 2023: రాత పరీక్ష లేకుండా తెలంగాణలో అధ్యాపక పోస్టులు.. ఎంపికైతే నెలకు రూ.లక్షల్లో జీతం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 ప్రభుత్వ వైద్య విద్య కాలేజీలు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో.. ఒప్పంద ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏడాది కాలంపాటు కాంట్రాక్టు విధానంలో పని చేసేందుకు ఈ రిక్రూట్‌మెంట్‌ను..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 ప్రభుత్వ వైద్య విద్య కాలేజీలు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో.. ఒప్పంద ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏడాది కాలంపాటు కాంట్రాక్టు విధానంలో పని చేసేందుకు ఈ రిక్రూట్‌మెంట్‌ను చేపబడుతున్నారు. ఏడాది తర్వాత అవసరాన్ని బట్టి పదవీ కాలాన్ని పొడిగిస్తారు. ఒకవేళ రెగ్యులర్ నియామకాలు చేపడితే కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా 26 ప్రభుత్వ మెడికాల్ కాలేజీలు ఉండగా వాటిల్లో గాంధీ, ఉస్మానియా, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలను మినహా.. మిగిలిన 23 కాలేజీల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అంటే.. వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్రికొత్తగూడెం, జగిత్యాల, సంగారెడ్డి, మంచిర్యాల, రామగుండం, కామారెడ్డి, వికారాబాద్, జనగామ, కరీంనగర్, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, ఖమ్మం, సిరిసిల్ల, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట జీఎంసీల్లో అధ్యాపక పోస్టులను భర్తా చేస్తారన్నమాట.
అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మాకాలజీ, ఫాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాల్లో ఖాళీలున్నాయి. సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే టీచింగ్ అనుభవం కూడాఉండాలి. అయితే రెగ్యులర్ ఉద్యోగులకన్నా వీరికి అధిక వేతనం ఇవ్వనున్నారు. ఎంపికైతే ప్రొఫెసర్‌కు రూ.1.90 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1.50 లక్షలు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1.25 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. ఏదైనా కారణంతో మధ్యలో ఉద్యోగాన్ని వదిలేస్తే మూడు నెలల జీతాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన వారు ఈ మెయిల్ ద్వారా ఆగస్టు 5లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆగస్టు 9న కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఎంపికైతే ఆగస్టు 24లోగా జాయినింగ్ రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది.
ఇ-మెయిల్ ఐడీ: dmerecruitment.contract@gmail.com
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.