Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సూపర్‌ స్టార్‌ బిరుదు నాకెప్పుడూ తలనొప్పే.. ఇక్కడ మీకో కథ చెప్పాలి’.. రజనీకాంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇటీవల 'సూపర్‌ స్టార్‌' అనే పదంపై పెద్ద చర్చనే సాగింది. దీనిపై రజనీ స్పందిస్తూ.. జైలర్‌ మువీలో 'హుకుమ్‌..' పాటలో సూపర్‌ స్టార్‌ అనే పదం వచ్చింది. ఆ పదాన్ని తొలగించాలని డైరెక్టర్‌కి చెప్పాను. నిజానికి.. సూపర్‌ స్టార్‌ అనే బిరుదు నాకు ఎప్పుడూ సమస్యగానే ఉండింది. 1977లోనే దీనిపై పెద్ద వివాదం జరిగింది. అప్పట్లో నటుడు కమలహాసన్‌, శివాజీ గణేషన్‌ ప్రముఖ నటులుగా రాణిస్తున్నారు. అలాంటి సమయంలో ఈ సూపర్‌ స్టార్‌..

'సూపర్‌ స్టార్‌ బిరుదు నాకెప్పుడూ తలనొప్పే.. ఇక్కడ మీకో కథ చెప్పాలి'.. రజనీకాంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
Rajinikanth
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 30, 2023 | 12:33 PM

చెన్నై, జులై 30: తమిళనాట సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు ఉన్న క్రేజీ అంతాఇంతా కాదు. రజనీ సినిమాలు ఒక్క తమిళ భాషలోనే కాకుండా తెలుగుతోపాటు దక్షిణాది భాషలన్నింటిలోనూ రఫ్పాడిస్తాయనేది కాదనలేని సత్యం. ఆయన విలక్షణ నటన, స్టైల్‌, డైలాగ్‌ డెలివరీయే అందుకు కారణం. ఆయన కొత్త మువీ జైలర్‌ నెల్సన్‌ దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మువీలో బాలీవుడ్‌ స్టార్‌ జాకీష్రాఫ్‌, కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌, టాలీవుడ్‌ నటుడు సునీల్‌, రమ్యకృష్ణ, తమన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 10వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ మువీ ఆడియో విడుదల ఫంక్షన్‌ జరిగింది. ఈ ఫంక్షన్‌ సందర్భంగా నటుడు రజనీకాంత్‌ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఇటీవల ‘సూపర్‌ స్టార్‌’ అనే పదంపై పెద్ద చర్చనే సాగింది. దీనిపై రజనీ స్పందిస్తూ.. జైలర్‌ మువీలో ‘హుకుమ్‌..’ పాటలో సూపర్‌ స్టార్‌ అనే పదం వచ్చింది. ఆ పదాన్ని తొలగించాలని డైరెక్టర్‌కి చెప్పాను. నిజానికి.. సూపర్‌ స్టార్‌ అనే బిరుదు నాకు ఎప్పుడూ సమస్యగానే ఉండింది. 1977లోనే దీనిపై పెద్ద వివాదం జరిగింది. అప్పట్లో నటుడు కమలహాసన్‌, శివాజీ గణేషన్‌ ప్రముఖ నటులుగా రాణిస్తున్నారు. అలాంటి సమయంలో ఈ సూపర్‌ స్టార్‌ పట్టం నాకు ఇవ్వడం పెద్ద వివాదానికి దారితీసింది.

ఇక్కడ మీకో చిన్న కథ చెప్పాలి. అడవిలో ఓ గద్ద, కాకి ఉన్నాయి. అయితే కాకి గద్దకంటే పైకి ఎగరడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఎప్పటికీ గద్దను మించి అది ఎగరలేదన్నది వాస్తవం. నేను జీవితంలో ఇద్దరికే భయపడతాను. అందులో ఒకరు భగవంతుడు, రెండోది మంచి మనుషులకే’ అని రజనీ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.