AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG DEECET 2025 Result Date: డీఈఈసెట్‌ ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది.. ఇంతకీ ఎప్పుడంటే?

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృత్తి విద్యా కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల డీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు మే 25 డీఈఈసెట్‌ 2025 రాత పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాల విడుదల తేదీని ఉన్నత విద్యామండలి తాజాగా విడుదల చేసింది. తాజా ప్రకటన మేరకు..

TG DEECET 2025 Result Date: డీఈఈసెట్‌ ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది.. ఇంతకీ ఎప్పుడంటే?
DEECET 2025 Result Date
Srilakshmi C
|

Updated on: May 26, 2025 | 3:12 PM

Share

హైదరాబాద్‌, మే 26: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృత్తి విద్యా కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల డీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు మే 25 డీఈఈసెట్‌ 2025 రాత పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాల విడుదల తేదీని ఉన్నత విద్యామండలి తాజాగా విడుదల చేసింది. తాజా ప్రకటన మేరకు జూన్‌ 5న ఈ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. డీఈఈసెట్‌ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఎల్‌ఈడీ), డిప్లొమా ఇన్‌ ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (డీపీఎస్‌ఈ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డీఈఈసెట్‌కు మొత్తం 77.54 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు టీజీడీఈఈసెట్‌ కన్వీనర్‌ జి రమేశ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. రెండు షిఫ్టుల్లో జరిగిన ఈ పరీక్షకు తెలుగు మీడియంకి 77.77 శాతం మంది.. ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలకు 77.39 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు ఆయన వెల్లడించారు. కాగా ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా డీఈఈసెట్‌కు దాదాపు 43,616 మంది దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే.

జూన్‌ 15 నుంచి తెలంగాణ ఈసెట్‌ 2025 కౌన్సెలింగ్‌.. త్వరలో షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఈసెట్‌ రాత పరీక్షలో మొత్తం96.22 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి తెలిపారు. మొత్తం 11 బ్రాంచీలకు సంబంధించి 18,928 మంది పరీక్ష రాయగా, అందులో 17,768 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 7,093 మంది అమ్మాయిలు, 11,835 మంది అబ్బాయిలు ఉత్తీర్ణత సాధించారు. అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 95.81గా నమోదుకాగా, అబ్బాయిల ఉత్తీర్ణత శాతం 92.71గా వచ్చింది. అయితే ఈసెట్‌ పరీక్షకు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడ్డారు. వారిలో అధికమంది ఉత్తమ ర్యాంకులు సాధించారు కూడా. అయితే వారికి ఈసారి రాష్ట్రంలో ప్రవేశాలు పొందేందుకు అవకాశం లేదని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ స్పష్టం వి.బాలకిష్టారెడ్డి చేశారు. ఇక జూన్‌ 15 నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?
బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!