SBI PO Recruitment: ఎస్‌బీఐ పీవో పోస్టులకు అప్లై చేసుకున్నారా.. దరఖాస్తులకు చివరి తేదీ దగ్గర పడుతోంది..
SBI PO Recruitment 2021: దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారీ స్థాయిలో ప్రొబేషనరీ పోస్టులను భర్తీ చేయనున్నారు...
SBI PO Recruitment 2021: దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారీ స్థాయిలో ప్రొబేషనరీ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు ఈ నెల 25తో ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 2056 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వీటిలో 2000రెగ్యులర్ పోస్టులు, 56 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
* చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
* అభ్యర్థుల వయసు 01.04.2021 నాటికి 21–30ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ముఖ్యమైన విషయాలు..
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను మూడంచెల విధానంలో ఎంపిక చేస్తారు. మొదట ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ ఎగ్జామినేషన్, చివరిగా ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 05-10-2021న ప్రారంభంకాగా.. 25.10.2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్షను నవంబర్/డిసెంబర్ 2021లో నిర్వహించనున్నారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Illegal liquor: ఓరి గడుగ్గాయ్.. బైక్‌లో ఇన్ని లిక్కర్ బాటిల్సా.. కౌంట్ చేసి కంగుతిన్న పోలీసులు
భక్తులను మెస్మరైజ్ చేస్తున్న కోతి.! సోషల్ మీడియాలో తెగ వైరల్.. వీడియో
భక్తులను మెస్మరైజ్ చేస్తున్న కోతి.! సోషల్ మీడియాలో తెగ వైరల్.. వీడియో