AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SECL Recruitment 2022: నెలకు రూ.2 లక్షల జీతంతో సౌత్‌ ఈస్ట్రన్‌ కోల్‌ ఫీల్డ్స్‌లో 130 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. అర్హతలేవంటే..

భారత ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వ శాఖకు చెందిన బిలాస్పూర్లోని సౌత్‌ ఈస్ట్రన్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (South Eastern Coalfields Limited).. 130 మెడికల్ స్పెషలిస్ట్, మెడికల్ ఆఫీసర్, సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ తదితర పోస్టుల..

SECL Recruitment 2022: నెలకు రూ.2 లక్షల జీతంతో సౌత్‌ ఈస్ట్రన్‌ కోల్‌ ఫీల్డ్స్‌లో 130 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. అర్హతలేవంటే..
Secl
Srilakshmi C
|

Updated on: Sep 21, 2022 | 8:29 AM

Share

SECL Bilaspur Medical Specialist Recruitment 2022: భారత ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వ శాఖకు చెందిన బిలాస్పూర్లోని సౌత్‌ ఈస్ట్రన్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (South Eastern Coalfields Limited).. 130 మెడికల్ స్పెషలిస్ట్, మెడికల్ ఆఫీసర్, సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ తదితర పోస్టుల (Medical Specialist Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సర్జన్‌, జనరల్ ఫిజీషియన్‌, జీ అండ్‌ ఓ, అనెస్థీషియా, ఆర్థోపెడిక్‌, పీడియాట్రీషియన్‌, సైకాలజిస్ట్‌, పాథాలజిస్ట్‌, డెర్మటాలజిస్ట్, పల్మనాలజిస్ట్‌, చెస్ట్‌ స్పెషలిస్ట్‌, ఆప్తల్మాలజిస్ట్‌, ఈఎన్టీ, రేడియాలజిస్ట్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ, డీఎన్‌బీ, బీడీఎస్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఆగస్టు 31, 2022వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 35 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 28, 2022వ తేదీ నుంచి అక్టోబర్‌ 29, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.60,000ల నుంచి రూ.2,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఖాళీల వివరాలు..

  • సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ (E4) & మెడికల్ స్పెషలిస్ట్ (E3) పోస్టులు: 57
  • సీనియర్‌ మెడికల్ ఆఫీసర్ (E3) పోస్టులు: 70
  • సీనియర్ మెడికల్ ఆఫీసర్ (డెంటల్) (E-3) పోస్టులు: 3

అడ్రస్: Dy.GM(P)/HoD(EE), South Eastern Coalfields Limited, Bilaspur.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం