SECL Recruitment: సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే..
SECL Recruitment 2022: సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (SECL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభిగాల్లో ఉన్న 133 ఖాళీలను భర్తీ చేయనున్నారు...
SECL Recruitment 2022: సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (SECL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభిగాల్లో ఉన్న 133 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 133 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో మైన్ సర్వేయర్ T&S గ్రేడ్-B (45), నర్స్ టీ అండ్ ఎస్ గ్రేడ్-C (59), ఫార్మసిస్ట్ గ్రేడ్-C (10), టెక్నీషియన్ (పాథలాజికల్) గ్రేడ్-సి (8), జూనియర్ టెక్ ఈసీసీ గ్రేడ్-డి (4), టెక్/రేడియోగ్రాఫర్ గ్రేడ్-సీ (01), టెక్నీషియన్ ఆప్టోమెట్రీ గ్రేడ్-డీ (06) పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి/డిప్లొమా/నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* మొదట అధికారిక వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం ఫామ్ ఫిల్ చేసి హార్డ్‌కాపీని నోటిఫికేషన్‌లో పేర్కొన్న అడ్రస్‌కు జులై 21,2022లోపు పంపించాల్సి ఉంటుంది. లేదంటే persnee.secl@coalindia.in మెయిల్ కు పంపించవచ్చు.
* అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 21-07-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..