Midhani Recruitment: మిధానీలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్షా లేకుండా, నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
Midhani Recruitment: మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధానీ)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఈ సంస్థలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగంలో...
Midhani Recruitment: మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధానీ)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఈ సంస్థలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా ఒమత్తం 06 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో అసిస్టెంట్ (03), అసోసియేట్లు (03) పోస్టులు ఉన్నాయి.
* అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించ కూడదు .
* అసోసియేట్లు పోస్టులకు అప్లై చేసుకునే వారు కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించాలి. వీటితో పాటు.. సంబంధిత పనిలో అనుభవం, టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు అవసరమైన డ్యాక్యుమెంట్లతో మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్, ప్లాట్-8, ఐఎంటీ ఎంట్రన్స్ రోడ్, సెక్టర్-30ఏ, ఇండస్ట్రియల్ మోడల్ టౌన్‌షిప్, రోహ్‌తక్, హరియాణ-124001 అడ్రస్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.
* వాక్ ఇన్ ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి…