SECI Recruitment 2022: నెలకు రూ.80 వేల జీతంతో.. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కొలువులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
భారత ప్రభుత్వ రెన్యువబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..
భారత ప్రభుత్వ రెన్యువబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. 15 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. హైడ్రోజన్ ఎనర్జీ, ఈవీ- ఛార్జింగ్ స్టేషన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, రూఫ్‌టాప్ సోలార్, బిజినెస్ డెవలప్‌మెంట్, ఫైనాన్స్, లీగల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ, మర్చంట్ ట్రేడింగ్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో సీఏ/సీఎంఏ/డిగ్రీ/ఎంబీఏ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం కూడా ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 25, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి మొదటి ఏడాది నెలకు రూ.70,000లు, రెండో ఏడాది నెలకు రూ.75,000లు, మూడో ఏడాది నెలకు రూ.80,000లు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.