లైఫ్ ఇన్సూరెన్స్ కోసం 4 ఏళ్లు పోరాటం చేసిన వితంతు మహిళ! ఎల్ఐసీకి గట్టి మొట్టికాయలు..
భర్త మరణానంతరం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఓ వితంతు మహిళ నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటం చేయవల్సి వచ్చింది. ఎట్టకేలకు ఇన్సూరెన్స్‌తోపాటు రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌తోపాటు, బోనస్ కూడా గెల్చుకుంది. వివరాల్లోకెళ్తే..
భర్త మరణానంతరం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఓ వితంతు మహిళ నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటం చేయవల్సి వచ్చింది. ఎట్టకేలకు ఇన్సూరెన్స్‌తోపాటు రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌తోపాటు, బోనస్ కూడా గెల్చుకుంది. వివరాల్లోకెళ్తే..
మహారాష్ట్రలోని ఘట్కోపర్‌కు చెందిన రేఖ వేద్ భర్త 2016 మార్చి 28, 2016 ఏప్రిల్ 15 తేదీల్లో వరుసగా రూ. 3 లక్షలు, రూ. 7 లక్షల బీమా కవరేజీతో రెండు పాలసీలు తీసుకున్నారు. అంతేకాకుండా క్రమం తప్పకుండా సదరు పాలసీలకు ప్రీమియం కూడా చెల్లించాడు.ఐతే సదరు వ్యక్తి పాలసీ తీసుకునే సమయానికి 60 ఏళ్లు ఉన్నాయి. అప్పటికే 10 ఏళ్లుగా హై బీపీతోపాటు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. పాలసీ తీసుకున్న మూడేళ్లలోపు రేఖ వేద్ భర్త 2018 ఆగస్ట్ 15న అనారోగ్యంతో మృతి చెందాడు. భర్త మరణానంతరం బీమా క్లైమ్ కోసం మృతుడి భార్య రేఖ వేద్ ఎల్‌ఐసీని సంప్రదిస్తే.. ఆమె భర్త బీమా అప్లికేషన్‌లో తప్పుడు సమాచారం ఇచ్చాడనే కారణంతో ఆమె ఆభ్యర్ధనను తిరస్కరించింది.
దీంతో వేద్ ముంబై సబర్బన్ డిస్ట్రిక్ట్ కన్‌జ్యూమర్ డిస్ప్యూట్స్ రెసిడెన్షియల్ కమిషన్ ఫిర్యాదు చేసింది. ఎల్‌ఐసీ అభ్యంతరాలను కమిషన్ ఖండించింది. పాలసీలు జారీ చేసే ముందు మెడికల్ ఆఫీసర్ ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్‌తోపాటు, ఆమె భర్త నింపిన ఫారమ్‌ను కూడా కమిషన్‌కు సమర్పించింది. ఐతే పాలసీ తీసుకున్న తేదీ నుంచి రెండేళ్ల తర్వాత ఎటువంటి అభ్యంతరాలు తెల్పడానికి అవకాశంలేదని పాలసీ రూల్స్‌లో ఎల్‌ఐసీ పేర్కొంది. ఐతే మహిళ దావా వేసే నాటికి పాలసీలు తీసుకుని రెండున్నరేళ్లు దాటాయి. రెండున్నరేళ్ల తర్వాత అభ్యంతరాలను లేవనెత్తడం పాలసీ నిబంధనలను ఉల్లంఘించడమేనని ఎల్ఐసీ తెల్పింది. ఫిర్యాదుదారుకు 60 ఏళ్లు దాటినప్పటికీ వైద్య పరీక్షలు నిర్వహించామని, సాధారణ పరిస్థితుల్లో 40 ఏళ్ల తర్వాత కొన్ని లేదా ఇతర వైద్యపరమైన సమస్యలు వస్తాయని, ఈ విషయాలేవి అప్లికేషన్‌లో పేర్కొనలేదని ఎల్ఐసీ వాదించింది.
నిజానికి అవి ‘జీవన్ విమా పాలసీలు’. అంటే అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు బీమా సౌకర్యం కల్పించేవన్నమాట. ఐతే ఈ కేసులో బీమా చేసిన వ్యక్తి అనారోగ్యంతో మరణిస్తే.. రూల్స్ ప్రకారం సదరు వ్యక్తి కుటుంబ సభ్యులకు బీమా మొత్తాన్ని చెల్లించాలని కమిషన్ ఎత్తి చూపింది. రూ. 10 లక్షల ఇన్సూరెన్స్‌తో పాటు నవంబర్ 2018 నుంచి ఆరు శాతం వడ్డీతో అక్యుములేటెడ్ బోనస్ ఇవ్వాలని ఆదేశించింది. దీంతోపాటు ఆమెను వేధింపులకు గురిచేసినందుకు రూ. 10,000, వ్యాజ్యం ఖర్చు రూ.5,000తో కలిపి మొత్తం సొమ్మును తక్షణమే చెల్లించాలని తెల్పింది. ఈ మేరకు అక్టోబర్ 18న ఉత్తర్వులు జారీ చేసింది.