AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ మంత్రం శక్తిని ప్రపంచం మొత్తం ఒప్పుకుంది.. ఉచ్చరణతోనే శారీరక, మానసిక వ్యాధులను నివారిస్తుంది..

హిందూమతానికి కేంద్ర బిందువు. పరమాత్మకు శబ్దరూపానికి ప్రతీక ఓం. అకార, ఉకార, మకార శబ్ధంలతో ఏర్పడిన ఓంకారం శబ్దాల్లో మొదటిది. ఓం, ఓమ్, లేదా ఓంకారం త్రిమూర్తి స్వరూపంగా చెప్పబడుతోంది. అటువంటి ఈ ఓంకార శబ్దం ప్రపంచంలోని అన్ని మంత్రాలకు కేంద్రంగా పరిగణించబడుతుంది. హిందువులు ఏ శుభకార్యం మొదలు పెట్టినా ఓం అనే అక్షరంతోనే శ్రీకారం చుడతారు. ఓం అనే పదాన్ని ఉచ్చరించడం ద్వారా శరీరంలో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. అందుకే ఓం జపం శరీరం, మనస్సు రెండింటినీ ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. ఓం మంత్రం ప్రయోజనాలు.. దానిని జపించేందుకు ఉన్న నియమాలను తెలుసుకుందాం.

ఈ మంత్రం శక్తిని ప్రపంచం మొత్తం ఒప్పుకుంది.. ఉచ్చరణతోనే శారీరక, మానసిక వ్యాధులను నివారిస్తుంది..
Ome Benefits
Surya Kala
|

Updated on: Apr 18, 2025 | 9:20 AM

Share

ఓంకారం త్రిమూర్తి స్వరూపంగా చెప్పబడుతోంది. ఇది భక్తి, ధ్యానం ప్రాథమిక మంత్రం అని చెప్పబడింది. ఓం జపించడం ద్వారా శరీరం మాత్రమే కాదు, మనస్సు కూడా ఆరోగ్యంగా మారుతుంది. ఓం కారం ప్రాముఖ్యతను ఎంత ప్రశంసించినా తక్కువే. ఓం అనే పదాన్ని ఉచ్చరించడం వల్ల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు లభిస్తాయి. ఓం అనే పదాన్ని ఉచ్చరించడం ద్వారా మీ శరీరం, మనస్సు రెండింటినీ శుద్ధి చేసుకోవచ్చు. వందలాది వ్యాధులను నయం చేయవచ్చు. శారీరక మానసిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ రోజు మనం ఓం జపించడం వల్ల కలిగే ప్రయోజనాలను.. ఓం జపించే విధానం, సరైన సమయం గురించి తెలుసుకుందాం..

ఓం జపించడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది?

ఓం ఉచ్చారణతో శరీర భాగాలలో కంపనాలు ప్రారంభమవుతాయి. ఉదాహరణకు శరీరం దిగువ భాగంలో A:, శరీరం మధ్య భాగంలో U.. M కంపనాలు శరీరం పై భాగానికి ప్రసారం చేయబడతాయి. ఓం అనే పదాన్ని ఉచ్చరించడం వల్ల అనేక శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్రయోజనాలను భారతదేశం మాత్రమే కాదు ఇతర దేశాలు కూడా ఆమోదించాయి. ఆధ్యాత్మికత మాత్రమే కాదు సైన్స్ కూడా ఓం శక్తిని తిరస్కరించలేకపోయింది.

హార్మోన్లు, చక్రాలపై ప్రభావవంతంగా ఉంటుంది

ధ్యానం చేస్తూ ఓం కార శబ్దాన్ని వినడం ద్వారా మనస్సు, ఆత్మ శరీరం లోపల, వెలుపల శాంతిని అనుభవిస్తాయి. ఓం కార శబ్దం శరీరంలోని అన్ని చక్రాలను, హార్మోన్ స్రవించే గ్రంథులను తాకినప్పుడు గ్రంథుల స్రావాన్ని నియంత్రిస్తుంది. కనుక దీనిని జపించడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి

ఒత్తిడికి అంతిమ ఔషధం

ఎవరైనా ఒత్తిడిలో ఉంటే.. చిన్న చిన్న విషయాలకే బాధపడుతుంటే, లేదా ఏదైనా మానసిక అనారోగ్యంతో బాధపడుతుంటే, ఓం జపం వీరికి దివ్యౌషధం. ఇప్పుడు ఓం శబ్దం ప్రయోజనాలు.. ఓం ను ఎప్పుడు, ఎలా ఉచ్చరించాలో తెలుసుకుందాం

ఎప్పుడు ఉచ్చరించాలంటే

  1. ప్రతి ఉదయం లేచిన తర్వాత.. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి. ఓంకార శబ్దాన్ని జపించండి. పద్మాసనం, అర్ధ పద్మాసనం, సుఖాసనం, వజ్రాసనంలో కూర్చొని ఓం అని ఉచ్చరించవచ్చు.
  2. మీ సౌలభ్యం ప్రకారం మీరు దీనిని 5, 7, 11, 21,108 సార్లు జపించవచ్చు.
  3. దీన్ని ఎప్పుడైనా జపించవచ్చు. అయితే సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో జపించడం అత్యంత ప్రభావ వంతం అని భావిస్తున్నారు.
  4. ఓం జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు
  5. ఓం జపించడం వల్ల ఏకాగ్రత పెరిగి జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
  6. శరీరం , మనస్సును కేంద్రీకరించడంలో సహాయపడుతుంది
  7. గుండె కొట్టుకోవడం, రక్త ప్రసరణ సక్రమంగా అవుతాయి.
  8. మానసిక వ్యాధులు తగ్గుముఖం పడతాయి.
  9. ఓం జపించడం వల్ల థైరాయిడ్ గ్రంథిపై సానుకూల ప్రభావం ఉంటుంది. తద్వారా థైరాయిడ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.
  10. ఓం జపించడం ద్వారా గుండె జబ్బులు కూడా మీ దరిదాపులకు రావు.
  11. జీర్ణవ్యవస్థ అదుపులో ఉంటుంది.
  12. ఇది నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
  13. ఓం జపించడం వల్ల రక్తపోటు, మధుమేహం రోగాలను నియంత్రిస్తుంది.
  14. ఓం జపించడం వల్ల శరీరం, మనస్సుపై సానుకూల ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు అంగీకరించారు.
  15. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా శరీరంలోని చనిపోయిన కణాలు కూడా పునర్జన్మ పొందడం ప్రారంభిస్తాయి.
  16. ఇది స్త్రీలలో వంధ్యత్వాన్ని కూడా తొలగిస్తుంది.
  17. ఓంకారాన్ని ఉచ్చరించేవాడు.. వినేవాడు ఇద్దరూ ప్రయోజనం పొందుతారు.
  18. ప్రతిరోజూ ఓం జపించడం ద్వారా మీలో జరిగే మార్పును మీరే అనుభవిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us