వామ్మో, ఇదెక్కడి ఊచకోత.. 10 సిక్స్‌లు, 9 ఫోర్లు.. కేవలం 3 ఓవర్లలోనే సెంచరీ.. 18 నిమిషాల్లో బౌలర్లకు బ్లడ్ బాత్
Century in just Three Overs: గూగుల్‌లో గూగ్లీస్ లేదా గూగుల్ సెర్చ్ గూగ్లీని గూగుల్ తీసుకొచ్చింది. ఇది అభిమానుల మేథాశక్తిని చెక్ చేసేందుకు, గూగుల్ ఆన్‌లైన్ సెర్చింగ్‌లో కొత్త అనుభవాన్ని అందించేందుకు రూపొందించింది. ఈ ఆవిష్కరణతో వినియోగదారులు మరింత తెలుసుకోవాలనే కోరికలను రేకెత్తించేందుకు ప్రయత్నిస్తోంది. మొత్తం ఆరు వారాలలో 50 గూగ్లీలను గూగుల్ అందించనుంది.

Century in just 3 Overs: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. ఊపిరి బిగపట్టే మ్యాచ్‌లతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు. తమ ఇష్టమైన ఆటగాళ్లు మైదానంలో సందడి చేస్తుండడంతో.. ఫ్యాన్స్ కూడా ఎనలేని ఉత్సాహంతో స్టేడియాలకు చేరుకుంటున్నారు. క్రికెట్ సీజన్ కావడంతో అభిమానులు ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో అభిమానుల క్రికెట్ పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి గూగుల్ గూగ్లీలను తీసుకొచ్చింది. తాజాగా అభిమానులు, గూగుల్ వినియోగదారుల కోసం ‘కేవలం 3 ఓవర్లలో ఎవరు సెంచరీ సాధించారు?’ అనే ప్రశ్నను గూగుల్ గూగ్లీ సంధించింది. ఈ ప్రశ్నను అన్‌లాక్ చేసేందుకు ఎంతోమంది అభిమానులు సిద్ధంగా ఉన్నారు. మరి ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలుసా?
గూగుల్‌లో గూగ్లీస్ అంటే ఏమిటి?
గూగుల్‌లో గూగ్లీస్ లేదా గూగుల్ సెర్చ్ గూగ్లీని గూగుల్ తీసుకొచ్చింది. ఇది అభిమానుల మేథాశక్తిని చెక్ చేసేందుకు, గూగుల్ ఆన్‌లైన్ సెర్చింగ్‌లో కొత్త అనుభవాన్ని అందించేందుకు రూపొందించింది. ఈ ఆవిష్కరణతో వినియోగదారులు మరింత తెలుసుకోవాలనే కోరికలను రేకెత్తించేందుకు ప్రయత్నిస్తోంది. మొత్తం ఆరు వారాలలో 50 గూగ్లీలను గూగుల్ అందించనుంది.
మూడు ఓవర్లలో సెంచరీ చేసినది ఎవరు? గూగుల్ ప్రశ్నకు సమాధానం ఏంటంటే?
క్రికెట్ దిగ్గజాలలో ఒకరైన సర్ డొనాల్డ్ బ్రాడ్‌మాన్ 1931లో కేవలం మూడు ఓవర్లలోనే సెంచరీ సాధించాడు. అదెలా అని ఆశ్చర్యపోతున్నారా.. అవును ఇక్కడ చెప్పింది నిజమే. ఆ కాలంలో, ఒక ఓవర్‌లో 8 బంతులు ఉండేవి. బ్లాక్‌హీత్ XI తరపున జరిగిన ఓ దేశీయ మ్యాచ్‌లో డాన్ బ్రాడ్‌మాన్ కేవలం 22 బంతుల్లో 100 పరుగులు సాధించాడు. వరుసగా మూడు ఓవర్లలో (ఓవర్‌కు 8 బంతులు) 100 పరుగులు చేశాడు. బ్లాక్‌హీత్ క్లబ్‌లో కొత్త మాల్థాయిడ్ పిచ్‌ను ప్రారంభించడంలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో లిత్‌గో పాటరీ జట్టుపై సర్ డొనాల్డ్ బ్రాడ్‌మాన్ ఈ ఘనతను సాధించాడు. మూడు ఓవర్లలో వరుసగా 33, 40, 27 పరుగులు చేశాడు.
బ్లాక్ వేసిన మొదటి ఓవర్‌లో 33 పరుగులు (6,6,4,2,4,4,6,1), హారీ బేకర్ వేసిన రెండవ ఓవర్‌లో 40 (6,4,4,6,6,4,6,4), బ్లాక్ వేసిన మూడవ ఓవర్‌లో 27 (1,6,6,1,1,4,4,6) పరుగులు చేసింది. ఇందులో మరో బ్యాటర్ వెండెల్ బిల్ చేసిన రెండు సింగిల్స్ కూడా ఉన్నాయి. మొదటి, ఐదవ బంతుల్లో ఈ సింగిల్స్ తీశాడు. అయితే బ్రాడ్‌మాన్ చివరికి 14 సిక్సర్లు, 29 ఫోర్లతో 256 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. బ్రాడ్‌మాన్ ఇన్నింగ్స్‌లో 14 సిక్సర్లు, 29 ఫోర్లు ఉన్నాయి. ఇది అతని మొత్తం ఫస్ట్-క్లాస్ కెరీర్‌లో కొట్టిన దానికంటే ఎక్కువ సిక్సర్లు ఉండడం గమనార్హం.
అంటే, నేటి గూగుల్ ప్రశ్నకు సమాధానం కోసం మనం శోధిస్తే, 1931లో జరిగిన దేశీయ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా లెజెండ్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మాన్ కేవలం 3 ఓవర్లలోనే సెంచరీ సాధించాడనే సమాధానం వస్తుంది. అయితే, ఇది అంతర్జాతీయ మ్యాచ్ కాదనే సంగతి గుర్తుంచుకోవాలి సుమా..!
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








