Video: రోహిత్ @ 100.. వాంఖడేలో వండర్‌ఫుల్ ఇన్నింగ్స్.. రికార్డులకే అబ్బా అనిపించిన హిట్‌మ్యాన్
Rohit Sharma Creates Big Sixes Record: ఆడింది చిన్న ఇన్నింగ్స్ అయినా, రికార్డుల పుస్తకాల్లో రోహిత్ శర్మ అరుదైన జాబిలో ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ జాబితాలో చేరిన హిట్‌మ్యాన్.. ఉన్నంత సేపు ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అందించాడు.

Rohit Sharma Creates Big Sixes Record: ఐపీఎల్ 2025లో 33వ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగింది . ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన పేరిట భారీ రికార్డు సృష్టించాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు నిరంతరం విఫలమవుతూనే ఉన్నాడు. తొలుత తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్.. ఆ తర్వాత పెవిలియన్ చేరాడు. అయితే, ఈ మ్యాచ్‌లో అతను కొన్ని అద్భుతమైన షాట్లు ఆడి భారీ రికార్డ్ సృష్టించాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ తన పాత శైలితో ఊగిపోయాడు. పుల్ షాట్ ద్వారా రెండు భారీ సిక్సర్లు బాదాడు. మహమ్మద్ షమీ, పాట్ కమ్మిన్స్ ఓవర్లలో సిక్సర్ల మోత మోగించాడు. రోహిత్ కేవలం 16 బంతుల్లో 3 సిక్సర్లతో 26 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మూడు సిక్సర్లతో రోహిత్ శర్మ ఐపీఎల్‌లో భారీ రికార్డు సృష్టించాడు.
రోహిత్ శర్మ ఇప్పుడు వాంఖడే స్టేడియంలో మొత్తం 100 సిక్సర్లు పూర్తి చేశాడు. వాంఖడేలో 100 ఐపీఎల్ సిక్సర్లు కొట్టిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. వాంఖడే స్టేడియంలో అతను తప్ప మరే ఇతర బ్యాట్స్‌మన్ 100 సిక్సర్లు కొట్టలేదు. అయితే, రోహిత్ శర్మ ఈ ఘనతను సాధించి, సత్తా చాటాడు. మొత్తం మీద ఒకే వేదికపై 100 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన నాల్గవ బ్యాట్స్‌మన్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు.
విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ జాబితాలో రోహిత్ ఎంట్రీ..
Currently, which duo is more depressing for their fans?
Rohit – Pawan Kalyan or Dhoni – PK ? #PawanKalyan #HariHaraVeeraMallu #RohitSharma #MSDhoni https://t.co/igujtyPSjX
— HHVM 🦅 – Pawan Kalyan (@HonestLeaderPK) April 18, 2025
రోహిత్ శర్మ కంటే ముందు, ఐపీఎల్‌లో ఒకే వేదికపై 100 కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఘనత ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లకు ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బెంగళూరుకు చెందిన ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ చిన్నస్వామి మైదానంలో 100 కి పైగా సిక్సర్లు కొట్టారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. అతను ఇప్పటివరకు చిన్నస్వామిలో మొత్తం 130 సిక్సర్లు కొట్టాడు. ఒకే వేదికపై అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్ అతనే. ఆ తర్వాత క్రిస్ గేల్ వంతు వస్తుంది. చిన్నస్వామిలో అతను 127 సిక్సర్లు కొట్టాడు. చిన్నస్వామిలో 118 సిక్సర్లతో ఏబీ డివిలియర్స్ మూడో స్థానంలో ఉన్నాడు. తాజాగా, ఈ జాబితాలో రోహిత్ శర్మ పేరు కూడా చేరింది. వాంఖడేలో కీరన్ పొలార్డ్ 85 సిక్సర్లు కొట్టాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








