AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రచ్చ రంబోలా అంటే ఇదే..! రూ.40 కోట్లు పెడితే.. రూ.160 కోట్లకు పైగా రాబట్టింది.. ఇప్పుడు ఎక్కడ చూడొచ్చంటే

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు పాన్ ఇండియా మూవీల హవ నడుస్తుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా అన్ని సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఊహించని విధంగా చిన్న సినిమాలు కూడా భారీగా రాబట్టి సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకునేది కూడా అలాంటి సినిమా గురించే..

రచ్చ రంబోలా అంటే ఇదే..! రూ.40 కోట్లు పెడితే.. రూ.160 కోట్లకు పైగా రాబట్టింది.. ఇప్పుడు ఎక్కడ చూడొచ్చంటే
Movie News
Rajeev Rayala
|

Updated on: Apr 18, 2025 | 10:11 AM

Share

ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్స్ అవుతూ ఉంటాయి. చిన్న సినిమాలు గా వచ్చిన సంచలనవిజయం సాధించిన సినిమాలు చాలా ఉన్నాయి. కొన్ని సినిమాలు పాన్ ఇండియా హిట్స్ గా కూడా మారాయి. అలాగే ఇంకొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలై బోల్తా కొట్టిన మూవీస్ చాలా ఉన్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు కూడా మినిమమ్ కూడా రాబట్టలేకపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ రొమాంటిక్ డ్రామా రూ. 40కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఏకంగా రూ. 160కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.? ఊహించని విధంగా భారీగా కలెక్షన్స్ రాబట్టి ఆ సినిమా చాలా మందికి ఫేవరెట్ మూవీ  ఇంతకూ ఆ సినిమా ఎదో.? హీరో, హీరోయిన్స్ ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : వయసులో నాకన్నా చిన్నోడే.. కానీ మగతనం ఎక్కువ.. నటి షాకింగ్ కామెంట్స్

రూ. 40కోట్లు పెడితే రూ. 160కోట్లకు పైగా రాబట్టిన ఆ సినిమా ఏది కాదు.. బాలీవుడ్ లో తెరకెక్కిన సోను కే టిటు కి స్వీటీ. ఈ సినిమా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతే కాదు కలెక్షన్స్ లోనూ నాలుగు రేట్లు ఎక్కువ వసూల్ చేసింది. ఈ సినిమాను రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కించారు.  సోనూ కే టిటూ కీ స్వీటీ 2018లో విడుదలైంది. ఈ సినిమాను లవ్ రంజన్ దర్శకత్వం వహించారు.  ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించగా.. సన్నీ సింగ్ సెకండ్ హీరోగా నటించాడు. అలాగే హీరోయిన్ గా నుష్రత్ భరూచ నటించింది.

ఇది కూడా చదవండి :పూరి సినిమాలో క్రేజీ బ్యూటీ.. విజయ్ సేతుపతికి జోడీగా బాలయ్య హీరోయిన్

అలాగే ఈ సినిమాలో ఇతర పాత్రల్లో అలోక్ నాథ్, వీరేంద్ర సక్సేనా, ఇషితా రాజ్ శర్మ, ఆయేషా రజా మిశ్రా, మధుమల్తి కపూర్, పవన్ చోప్రా, దీపికా అమీన్, రాజేష్ జైస్ కనిపించారు. థియేటర్లలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 50 రోజులకు పైగా థియేటర్స్ లో ఆడింది ఈ సినిమా. మ్యూజిక్ డైరెక్టర్ రోచక్ కోహ్లి అందించిన సంగీతం ఈ సినిమాకే హైలైట్ అని చెప్పాలి. ఈ సినిమా కార్తీక్ ఆర్యన్ కెరీర్ లో మొదటి బ్లాక్ బస్టర్. ఈ యంగ్ హీరో కెరీర్ లో మొదటి రూ. 100కోట్ల సినిమా ఇదే.. ఇక ఈ సినిమా రూ.160కోట్లకు పైగా రాబట్టి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది ఈ మూవీ.

ఇది కూడా చదవండి :నాన్న స్టార్ హీరో.. అమ్మ క్రేజీ హీరోయిన్.. కూతురికి మాత్రం ఒక్క హిట్ లేదు.. ఈ చిన్నది ఎవరో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.