రేప్ సీన్ తర్వాత వాంతి చేసుకున్నా.. అసలు విషయం చెప్పిన హీరోయిన్
రీసెంట్ డేస్ లో సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ కు, బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మారుతున్న జనరేషన్స్ కు తగ్గట్టుగా సినిమాల్లోనూ ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. అలాగే యాక్షన్ సీన్స్ తో పాటు రొమాంటిక్స్ సీన్స్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మనదగ్గర బోల్డ్ సీన్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.

సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ అనేవి చాలా కామన్ అయ్యాయి. ఈ మధ్య కాలంలో సినిమాల్లో రొమాంటిక్ టచ్ ఎక్కువగానే ఇస్తున్నారు దర్శకులు. ఏ జోనర్ సినిమా అయినా సరే కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉండాల్సిందే.. మినిమమ్ లిప్ కిస్ లేకుండా సినిమాలు రావడం లేదు. అయితే హీరోయిన్స్ కూడా రొమాంటిక్, ఇంటిమేట్ సీన్స్ లో నటించడానికి వెనకాడటం లేదు. గ్లామర్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు అందాల భామలు. అయితే కొంతమంది హీరోయిన్స్ మాత్రం రొమాంటిక్స్ సీన్స్ జోలికి పోకుండా జాగ్రత్తపడుతున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది నటీమణులు రొమాంటిక్ సీన్స్ లో నటించడం ఇబ్బందిగా ఫీల్ అయినట్టు తెలిపారు. ఇక ఇప్పుడు ఓ హీరోయిన్ ఏకంగా రేప్ సీన్ షూటింగ్ సమయంలో ఏకంగా వాంతులు చేసుకున్నా అని తెలిపింది.
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన రీ రిలీజ్ హంగామా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ కూడా రీ రిలీజ్ అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్స్ లో హీరోయిన్ షూటింగ్ లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ దియా మీర్జా. అందాల భామ దియా మీర్జా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇక ఈ అమ్మడు 2019లో కాఫిర్ అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది. ఈ సిరీస్ విపరీతమైన రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఈ సిరీస్ ను రీ రిలీజ్ చేస్తున్నారు.
తాజాగా ఈ వెబ్ సిరీస్ రీ రిలీజ్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆ సిరీస్ షూటింగ్ లో జరిగిన చేదు అనుభవం గురించి తెలిపింది. ఈ సిరీస్ షూటింగ్ లో ఓ రేప్ సీన్ షూటింగ్ తర్వాత తాను వాంతి చేసుకున్నానని తెలిపింది. కాఫిర్ కు సోనమ్ నాయర్ దర్శకత్వం వహించారు. దియా మీర్జా కైనాజ్ అక్తర్ అనే క్యారెక్టర్‌లో నటించింది. రేప్ సీన్ తర్వాత నేను శారీరకంగా చాలా వణికిపోయాను. ఆ సీన్ కంప్లీట్ అయిన తర్వాత నేను వాంతులు చేసుకున్నా.. పరిస్థితులు డిమాండ్ చేయడంతో ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా అలసిపోయాను అని చెప్పుకొచ్చింది దియా మీర్జా. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




