17 April 2025

మొన్న మామ.. ఇప్పుడు అల్లుడితో టాలీవుడ్ హీరోయిన్.. అమ్మడుకు లక్కీ ఛాన్స్..

Rajitha Chanti

Pic credit - Instagram

మొన్న మామయ్యతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకుంది ఈ టాలీవుడ్ హీరోయిన్. ఇక ఇప్పుడు అల్లుడు సరసన నటించేందుకు రెడీ అయినట్లు సమాచారం. 

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ మీనాక్షి చౌదరి. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. 

ఇక ఇప్పుడు అక్కినేని నాగచైతన్య సరసన నటించేందుకు రెడీ అయ్యిందట మీనాక్షి. మామఅల్లుళ్లతో వెంటవెంటనే స్క్రీన్ షేర్ చేసుకుంటుంది ఈ బ్యూటీ.

ప్రస్తుతం చైతూ నటిస్తోన్న అప్ కమింగ్ ప్రాజెక్ట్ NC 24పై అందరి ఫోకస్ పడింది. ఇందులో చైతూ సరసన మీనాక్షి చౌదరిని సెలక్ట్ చేశారని అంటున్నారు. 

ఇప్పుడిప్పుడే తెలుగులో మోస్ట్ వాంటెడ్ క్రేజీ హీరోయిన్ గా మారింది మీనాక్షి. టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. 

ఇటీవల లక్కీ భాస్కర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అలాగే తెలుగులో ఈ అమ్మడుకు స్టార్ హీరోల సరసన క్రేజీ ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. 

 ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మీనాక్షి. సినిమాల్లోకి రాకముందు ఆమె డెంటిస్ట్‏గా వర్క్ చేసినందట

అటు సినిమాలతో బిజీగా ఉన్న మీనాక్షి ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్. నిత్యం క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది.