AMD Recruitment 2022: అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌లో 321 సెక్యురిటీ గార్డ్‌ ఉద్యోగాలు..టెన్త్ పాసైన వారు అర్హులు..

కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ ఫర్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఏఎమ్‌డీ).. 321 జూనియర్ ట్రాన్స్‌లేటర్ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ సెక్యురిటీ ఆఫీసర్‌, సెక్యురిటీ గార్డు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

AMD Recruitment 2022: అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌లో 321 సెక్యురిటీ గార్డ్‌ ఉద్యోగాలు..టెన్త్ పాసైన వారు అర్హులు..
AMD Security Guard Recruitment 2022
Follow us

|

Updated on: Oct 28, 2022 | 8:46 AM

కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ ఫర్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఏఎమ్‌డీ).. 321 జూనియర్ ట్రాన్స్‌లేటర్ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ సెక్యురిటీ ఆఫీసర్‌, సెక్యురిటీ గార్డు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా నవంబర్‌ 7, 2022వ తేదీ నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 17, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి దరఖాస్తుదారులు రూ.100ల నుంచి రూ.200ల వరకు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 29వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • జూనియర్ ట్రాన్స్‌లేటర్ ఆఫీసర్‌ పోస్టులు: 9
  • అసిస్టెంట్‌ సెక్యురిటీ ఆఫీసర్‌ పోస్టులు: 38
  • సెక్యురిటీ గార్డు పోస్టులు: 274

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.