SBI Recruitment: దేశవ్యాప్తంగా ఖాళీల భర్తీకి ఎస్‌బీఐ నోటిఫికేషన్.. హైదరాబాద్ సర్కిల్‌లో ఎన్ని ఖాళీలున్నాయంటే..
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ సర్కిళ్లలో భారీ ఎత్తున పోస్టులను భర్తీ చేయనున్నారు. దేశంలోని పలు ఎస్‌బీఐ సర్కిల్స్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎవరు అర్హులు.?
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ సర్కిళ్లలో భారీ ఎత్తున పోస్టులను భర్తీ చేయనున్నారు. దేశంలోని పలు ఎస్‌బీఐ సర్కిల్స్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా భోపాల్, భువనేశ్వర్, హైదరాబాద్, జైపుర్, కోల్‌కతా, మహారాష్ట్ర, నార్త్ ఈస్టెర్న్ సర్కిళ్లలో ఉన్న 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* హైదరాబాద్ సర్కిల్‌లో 176 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సర్కిల్/ రాష్ట్రంలో పని చేయాల్సి ఉంటుంది.
* 1422 పోస్టులకు గాను రెగ్యులర్ ఖాళీలు- 1400, బ్యాక్‌లాగ్ ఖాళీలు- 22 ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 30-09-2022 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఆన్‌లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన వారికి నెలకు రూ. 36,000 నుంచి రూ. 63,840 వరకు చెల్లిస్తారు.
* తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రయి 18-10-2022న ప్రారంభమై 07-11-2022తో ముగియనుంది.
* అడ్మిట్ కార్డులను నవంబర్ లేదా డిసెంబర్‌లో అందుబాటులోకి తీసుకొస్తారు. ఆన్‌లైన్ పరీక్షను డిసెంబర్ 04, 2022 తేదీన నిర్వహిస్తారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..