SBI Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఎస్‌బీఐలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా

SBI Recruitment 2021: ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో అనేక ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇక బ్యాంకింగ్‌ రంగంలో చాలా ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇక తాజాగా స్టేట్ బ్యాంక్..

SBI Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఎస్‌బీఐలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా
Sbi Jobs
Follow us
Subhash Goud

|

Updated on: Aug 17, 2021 | 1:00 PM

SBI Recruitment 2021: ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో అనేక ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇక బ్యాంకింగ్‌ రంగంలో చాలా ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇక తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 69 ఖాళీలను ప్రకటించింది. పలు విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, రిలేషన్‌షిప్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్ లాంటి పోస్టులు ఉన్నాయి. రూ. 63 వేలకుపైగా వేతనం అందుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి సెప్టెంబర్ 2 చివరి తేదీ. వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.

మొత్తం ఖాళీలు- 69

అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ సివిల్- 36 అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్- 10 డిప్యూటీ మేనేజర్ అగ్రికల్చర్ స్పెషలిస్ట్- 10 రిలేషన్‌షిప్ మేనేజర్ (ఓఎంపీ)- 6 ప్రొడక్ట్ మేనేజర్ (ఓఎంపీ)- 2 అసిస్టెంట్ మేనేజర్ (మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్)- 4 సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్- 1

దరఖాస్తు ప్రారంభం: 2021 ఆగస్ట్ 13 దరఖాస్తుకు చివరి తేదీ: 2021 సెప్టెంబర్ 2 విద్యార్హతలు: సంబంధిత బ్రాంచ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీఏ, పీజీడీఎం ఇన్ రూరల్ మేనేజ్‌మెంట్ లాంటి కోర్సులు పాస్ కావాలి. వయస్సు: 25 నుంచి 25 ఏళ్ల వరకు దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750 ఫీజు చెల్లించాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ. వేతనం: రూ.63,840 వరకు

అభ్యర్థులు ముందుగా  వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. కెరీర్స్ సెక్షన్‌లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఉంటుంది. అందులో డిప్యూటీ మేనేజర్, రిలేషన్‌షిప్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్ పోస్టులకు వేర్వేరు దరఖాస్తు లింక్స్ ఉంటాయి. మీరు అప్లై చేయాలనుకునే పోస్టు లింక్ పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Click for New Registration పైన క్లిక్ చేయాలి. తర్వాత దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయడానికి ఐదు స్టెప్స్ ఉంటాయి. 1వస్టేప్‌. పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి. 2వ స్టేప్‌: ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. 3వ స్టేప్‌: అభ్యర్థి అర్హతల వివరాలు ఎంటర్ చేయాలి. 4వ స్టేప్‌: స్టెప్‌లో అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. 5వ స్టేప్‌: దరఖాస్తు ఫీజు పేమెంట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

ఇవీ కూడా చదవండి:  Telangana Intermediate Board: గుడ్‌న్యూస్.. ఇంటర్ ప్రవేశాల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటివరకంటే..?

IOCL Recruitment: ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. తెలుగు రాష్ట్రాల్లోనూ. ఇలా అప్లై చేసుకోండి.