Union Bank Recruitment: యూనియన్ బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. అర్హులెవరు, ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకోండి.
Union Bank Recruitment: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 2021-2022 ఏడాదికిగాను...
Union Bank Recruitment: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 2021-2022 ఏడాదికిగాను బ్యాంకు ఈ పోస్టులను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు బ్యాంకు అధికారికంగా తెలిపింది. దరఖాస్తుల ప్రక్రియ, అర్హత లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 347 ఖాళీలను భర్తీ చేయనున్నారు. * వీటిలో సీనియర్ మేనేజర్లు–60, మేనేజర్లు–141, అసిస్టెంట్ మేనేజర్లు–146 ఖాళీలున్నాయి. * రిస్క్, సివిల్ ఇంజనీర్, ఆర్కిటెక్ట్, ఆర్కిటెక్ట్ ఇంజనీర్, ప్రింటింగ్ టెక్నాలజిస్ట్, ఫోరెక్స్, చార్టర్డ్ అకౌంటెంట్, టెక్నికల్ ఆఫీసర్లు వంటి విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. * ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. పోస్టులను అనుసరించి ఏదైనా గ్రాడ్యుయేషన్ లేదా సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంబీఏ, సీఏ/సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ)/సీఎస్ ఉత్తీర్ణతతోపాటు పనిలో అనుభవం, సంబంధిత సర్టిఫికెట్లు ఉండాలి. * సీనియర్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 30 నుంచి 40ఏళ్లు, మిగతా పోస్టులకు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులను ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. * ఆన్‌లైన్ టెస్ట్‌ను మొత్తం నాలుగు విభాగాల్లో 200 మార్కులకు నిర్వహిస్తారు. * దరఖాస్తుల స్వీకరణ 03-09-2021తో ముగియనుంది. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: SBI Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఎస్‌బీఐలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా
Telangana Intermediate Board: గుడ్‌న్యూస్.. ఇంటర్ ప్రవేశాల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటివరకంటే..?