SAIL Recruitment 2023: పదో తరగతి అర్హతతో బొకారో స్టీల్‌ప్లాంట్‌లో 239 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

జార్ఖండ్ రాష్ట్రంలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. 239 కన్సల్టెంట్, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (ఎగ్జిక్యూటివ్, నాన్‌ ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే..

SAIL Recruitment 2023: పదో తరగతి అర్హతతో బొకారో స్టీల్‌ప్లాంట్‌లో 239 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
SAIL Bokaro Steel Plant
Follow us

|

Updated on: Mar 27, 2023 | 1:42 PM

జార్ఖండ్ రాష్ట్రంలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. 239 కన్సల్టెంట్, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (ఎగ్జిక్యూటివ్, నాన్‌ ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు 28 నుంచి 41 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్ 15, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.700, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఈఎస్ఎమ్‌ అభ్యర్ధులు రూ.200లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్/ ట్రేడ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష/ఇంటర్వ్యూలు మే-జూన్ నెలల్లో నిర్వహిస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.25,070ల నుంచి రూ.2,20,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..

ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు..

  • కన్సల్టెంట్ పోస్టులు: 10
  • మెడికల్ ఆఫీసర్ పోస్టులు: 10
  • మెడికల్ ఆఫీసర్ పోస్టులు: 3
  • అసిస్టెంట్ మేనేజర్(సేఫ్టీ) పోస్టులు: 3
  • మేనేజ్‌మెంట్ ట్రైనీ టెక్నికల్(ఎన్విరాన్‌మెంట్) పోస్టులు: 4

నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు..

  • ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ) పోస్టులు: 87
  • మైనింగ్ ఫోర్‌మాన్ పోస్టులు: 9
  • సర్వేయర్ పోస్టులు: 6
  • మైనింగ్ మేట్ పోస్టులు: 20
  • అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ)- హెచ్‌ఎంవీ పోస్టులు: 34
  • అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ ఎలక్ట్రీషియన్ పోస్టులు: 50
  • మైనింగ్ సిర్దార్ పోస్టులు: 8

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.