RCFL Recruitment: ప్రభుత్వ రంగ సంస్థలో అప్రెంటిస్‌ పోస్టులు.. అకడమిక్స్‌లో సాధించిన స్కోర్‌ ఆధారంగా ఎంపిక.

Narender Vaitla

Narender Vaitla |

Updated on: Jul 31, 2021 | 8:44 AM

RCFL Recruitment 2021: ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఆర్సీఎఫ్‌ఎల్‌) పలు అప్రెంటిస్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా...

RCFL Recruitment: ప్రభుత్వ రంగ సంస్థలో అప్రెంటిస్‌ పోస్టులు.. అకడమిక్స్‌లో సాధించిన స్కోర్‌ ఆధారంగా ఎంపిక.
Rcfl Recruitment

RCFL Recruitment 2021: ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఆర్సీఎఫ్‌ఎల్‌) పలు అప్రెంటిస్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 104 అప్రెంటిస్‌షిప్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ నేడు (శనివారం) ప్రారంభమైన నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

భర్తీ చేయనున్న అప్రెంటిస్‌ పోస్టులు, అర్హతలు..

* మొత్తం 104 ఖాళీలకు గాను.. హెచ్‌ఆర్‌ (రిక్రూట్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌) ట్రైనీ 10, ఏఓసీపీ ట్రైనీ 60, అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ 10, మెడికల్‌ ల్యాబ్‌ (పాథాలజీ) ట్రైనీ 5, డిప్లొమా 19 (కెమికల్‌ 4, కంప్యూటర్‌ 5, ఎలక్ట్రికల్‌ 5, మెకానికల్‌ 5) పోస్టులను భర్తీ చేయనున్నారు. * అర్హతల విషయానికొస్తే.. హెచ్‌ఆర్‌ ట్రైనీ ట్రేడ్‌కు దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీ ఉత్తీర్ణులై ఇంగ్లిష్‌లో పరిజ్ఞానం ఉండాలి. ఏఓసీపీ ట్రేడ్‌కు అప్లై చేసుకునే వారు బీఎస్సీ కెమిస్ట్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌కు బీకామ్‌, బీబీఏ, ఎకనమిక్స్‌లో డిగ్రీ, ల్యాబ్‌టెక్నీషియన్‌కు హెచ్‌ఎస్సీ, డిప్లొమా ట్రేడ్‌లకు సంబంధిత ట్రేడ్‌లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. * అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అప్రెంటిస్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 12 నెలల పాటు శిక్షణ అందిస్తారు. * అభ్యర్థులను ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా అకడమిక్‌ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. * ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * దరఖాస్తుల ప్రక్రియ జులై 31న ప్రారంభంకాగా చివరి తేదీగా ఆగస్టు 7ను నిర్ణయించారు. * పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Flipkart: ఏపీలో పదో తరగతి అర్హతతో ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకునేందుకు నేడే చివరి తేదీ

CBSE 12th Result 2021 Topper List: సీబీఎస్ఈ బోర్డు ఫలితాల్లో టాపర్స్ వీరే.. పూర్తి వివరాలు మీకోసం..

PNB Pratibha Loan : పిఎన్‌బి ఎడ్యుకేషన్ లోన్‌కి ఎవరు అర్హులు..! ఎంత మొత్తం చెల్లిస్తారు.. పూర్తి వివరాలు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu