Railway Jobs: బీటెక్‌ చేసిన వారికి రైల్వేలో ఉద్యోగాలు.. గేట్‌ స్కోర్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..

Railway Jobs: సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే (SER) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కోల్‌కతా ప్రధాన కేంద్రంగా నడిచే ఈ సంస్థలో వివిధ విభాగాల్లో ఉన్న జూనియర్‌ టెక్నికల్‌ అసోసియేట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు...

Railway Jobs: బీటెక్‌ చేసిన వారికి రైల్వేలో ఉద్యోగాలు.. గేట్‌ స్కోర్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..
Special Trains
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 05, 2022 | 4:26 PM

Railway Jobs: సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే (SER) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కోల్‌కతా ప్రధాన కేంద్రంగా నడిచే ఈ సంస్థలో వివిధ విభాగాల్లో ఉన్న జూనియర్‌ టెక్నికల్‌ అసోసియేట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్‌ విధానంలో ఈ పోస్టులను తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? అర్హులెవరు లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 17 పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో సివిల్‌ ఇంజినీరింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ (15), ఎలక్ట్రికల్‌ కన్‌స్ట్రక్షన్‌ (02) పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు 2021/ 2022 వాలిడ్‌ గేట్‌ స్కోర్‌ కలిగి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు…

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

* అభ్యర్థులు తమ దరఖాస్తులను సీనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌, సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే, గార్డెన్‌ రీచ్‌ రోడ్‌, కోల్‌కతా-700043 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 18-07-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* అభ్యర్థులను గేట్‌ మెరిట్‌ స్కోర్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..