Personality Test: మీ కాలి వేళ్ల ఆకారంతో మీరు ఎలాంటి వారో చెప్పొచ్చు.. ఓసారి ట్రై చేసి చూడండి..
Personality Test: మనిషి మనస్తత్వాన్ని వారి వ్యవహార శైలి ఆధారంగా అంచనా వేయొచ్చనే విషయం తెలిసిందే. నడిచే విధానం, డ్రస్ చేసుకునే పద్ధతి ద్వారా కూడా మీరు ఎలాంటి వారో చెబుతారు..
Personality Test: మనిషి మనస్తత్వాన్ని వారి వ్యవహార శైలి ఆధారంగా అంచనా వేయొచ్చనే విషయం తెలిసిందే. నడిచే విధానం, డ్రస్ చేసుకునే పద్ధతి ద్వారా కూడా మీరు ఎలాంటి వారో చెబుతారు మానసిక నిపుణులు. అయితే మీ కాలి వేళ్ల ఆధారంగా కూడా మీ వ్వక్తిత్వం ఎలాంటితో తెలుసుకోవచ్చని మీకు తెలుసా.? అవును నిజమే.. కాలి వేళ్ల ఆకారంలో ఉండే మార్పుల ఆధారంగా మనం ఎలాంటి వారిమనే వివరాలు చెప్పొచ్చు. ఇందుకోసం కాలి ఆకారాలను మొత్తం 4 రకాలుగా విభజించారు. ఈజిప్షియన్ ఫూట్, రోమన్ ఫూట్, గ్రీక్ ఫూట్, స్వ్కేర్ ఫూట్ అని నాలుగు రకాలుగా ఉండే పాదం ఆకారం మీ వ్యక్తిత్వాన్ని చెబుతుంది. అవేంటంటే..
ఈజిప్షియన్ ఫూట్..
పైన కనిపిస్తోన్న ఆకారంలో మీ వేళ్లు కనుక ఉంటే మీరు చాలా స్నేహపూర్వకంగా ఉంటారని అర్థం. మీరు రాయల్టీగా ఉండడాన్ని ఇష్టపడరు. వీలైనంత వరకు వాస్తవికతలో జీవిస్తారు. వీరు వారి జీవితంలోని చాలా అంశాలను బయటి వాళ్లకు తెలపరు. తమ ఆలోచనలను తమలోనే దాచుకుంటారు. ఇలాంటి వారు ఇతరుల సాన్నిహిత్యం కంటే తమతో తామే ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
రోమన్ ఫూట్..
పైన కనిపిస్తోన్న ఆకారాన్ని రోమన్ ఫూట్ అంటారు. ఇలాంటి ఆకారంలో వేళ్లు ఉన్న వారు ఇతరులను ఇట్టే ఆకర్షిస్తారు. వీరు చాలా ధైర్యవంతులు, ఆనందం కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి ఇష్టపడతారు. వీరు స్టేబుల్‌తో కూడుకున్న జీవితాన్ని గడుపుతారు. ఈ ఆకారంలో వేళ్లు ఉన్న వారు మొండిగా వ్యవహరిస్తారు.
గ్రీక్ ఫూట్…
పైన కనిపిస్తోన్న ఆకారంలో మీ కాలి వేళ్లు ఉంటే.. మీరు కొత్త ఆలోచనలను తీసుకురావడానికి ఇష్టపడే సృజన్మాత్మక కలిగిన వ్యక్తి అని అర్థం. మీది చిరుకుగా ఉండే స్వభావం. అయితే ఈ ఆకారంలో వేళ్లు ఉన్న వారు ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంటారు. నమ్మిన విషయాన్ని కట్టుబడి ఉంటారు. నేను నమ్మిందే నిజమనే భావనలో ఉంటారు.
స్క్వేర్ ఫూట్..
పైన ఉన్న ఆకారంలో మీ కాలి వేళ్లు ఉంటే మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దాని వల్ల కలిగే లాభ నష్టాలను ఒకటికి రెండు సార్లు చూసుకుంటారు. మీరు నిజాయితీగా ఉంటారు. నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం పట్టినా, తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. వీరు ఎల్లప్పుడూ సానుకూల ఆలోచనలతో ఉంటారు.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..