AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway recruitment: ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి రైల్వేలో ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..

Railway recruitment: ఇంజ‌నీరింగ్ పూర్తి చేసిన సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉన్న వారికి ఇండియ‌న్ రైల్వే ఉద్యోగాల భ‌ర్తీకి ఆహ్వానం ప‌లుకుతోంది. రైల్వే మంత్రిత్వ శాఖ‌కి చెందిన న‌వీ ముంబ‌యిలోని కొంక‌ణ్ రైల్వే కార్పొరేష‌న్ లిమిటెడ్..

Railway recruitment: ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి రైల్వేలో ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..
Narender Vaitla
|

Updated on: Jan 29, 2022 | 6:57 AM

Share

Railway recruitment: ఇంజ‌నీరింగ్ పూర్తి చేసిన సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉన్న వారికి ఇండియ‌న్ రైల్వే ఉద్యోగాల భ‌ర్తీకి ఆహ్వానం ప‌లుకుతోంది. రైల్వే మంత్రిత్వ శాఖ‌కి చెందిన న‌వీ ముంబ‌యిలోని కొంక‌ణ్ రైల్వే కార్పొరేష‌న్ లిమిటెడ్ (కేఆర్‌సీఎల్‌) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 14 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ (ఫాబ్రికేషన్‌): 04, సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఫాబ్రికేషన్‌): 10 పోస్టులు ఉన్నాయి.

* అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ (ఫాబ్రికేషన్‌) పోస్టుల‌కు ధ‌ర‌ఖాస్తుకునే వారు కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి. దీంతో సంబంధిత ప‌నిలో అనుభ‌వం త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 45 ఏళ్లు మించ‌కూడ‌దు.

* సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఫాబ్రికేషన్‌) పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చ‌సుకునే కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 45 ఏళ్లు మించ‌కూడ‌దు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు నేరుగా వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకు హాజ‌రుకావాల్సి ఉంటుంది.

* నోటిఫికేష‌న్‌లో భాగంగా ద‌ర‌ఖాస్తు ఫామ్‌ను నింపి, అవ‌స‌ర‌మైన డ్యాక్యుమెంట్ల‌తో ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకావాల్సి ఉంటుంది.

* వాక్ ఇంట‌ర్వ్యూల‌ను ఎక్స్‌క్యూటివ్ క్ల‌బ్‌, కొంక‌ణ్ రైల్ విహార్‌, కొంక‌ణ్ రైల్వే కార్పొరేష‌న్ లిమిటెడ్‌, సెక్టార్ 40, సీవుడ్స్‌, న‌వీ ముంబ‌యి, 400706 అడ్ర‌స్‌లో నిర్వ‌హించ‌నున్నారు.

* వాన్ఇన్‌ను 07-02-2022న నిర్వ‌హించ‌నున్నారు.

* పూర్తి వివ‌రాల కోసి ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: WhatsApp Groups: వాట్సాప్ గ్రూప్‌ అడ్మిన్ల కోసం అదిరిపోయే ఫీచర్.. ఇక అలాంటి సందేశాలకు చెక్‌..!

Bandi Sanjay: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ‘మిలియన్ మార్చ్’.. కార్యాచరణ ప్రకటించిన బండి సంజయ్..

Team India: వరల్డ్ బెస్ట్ బౌలర్.. 16 ఏళ్ల కెరీర్‌లో ఒక్క నో బాల్ కూడా వేయలేదు.. ఎవరో తెలుసా.?