Interview Tips: ఇంటర్వ్యూలో ఈ పనులు అస్సలు చేయకండి.. ఉద్యోగం కొట్టాలంటే ఈ టిప్స్ పాటించండి..

రాత పరీక్షను చాలా మంది సులువుగానే అధిగమిస్తారు. కానీ పర్సనల్ ఇంటర్వ్యూలో చేతులెత్తేస్తారు. దీనికి ప్రధాన కారణం వారిలోని ఆత్మన్యూనతా భావం. అంతేకాక తమలోని భావాలను స్పష్టంగా వ్యక్తపరచడంలో విఫలం అవడం. అయితే కొన్ని విషయాలపై అవగాహన పొందడం ద్వారా ఇంటర్వ్యూని సులభంగా అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Interview Tips: ఇంటర్వ్యూలో ఈ పనులు అస్సలు చేయకండి.. ఉద్యోగం కొట్టాలంటే ఈ టిప్స్ పాటించండి..
Interview Tips
Follow us
Madhu

|

Updated on: Mar 17, 2024 | 6:23 AM

ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరి కల. చదువు పూర్తయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగంలే అనుకోకుండా.. మనం అనుకున్న ఉద్యోగం, మనం కలలు కన్న ఉద్యోగం సాధించడంలోనే అసలైన కిక్ ఉంటుంది. అందుకు ప్రధాన అడ్డంగా ఇంటర్వ్యూ. రాత పరీక్షను చాలా మంది సులువుగానే అధిగమిస్తారు. కానీ పర్సనల్ ఇంటర్వ్యూలో చేతులెత్తేస్తారు. దీనికి ప్రధాన కారణం వారిలోని ఆత్మన్యూనతా భావం. అంతేకాక తమలోని భావాలను స్పష్టంగా వ్యక్తపరచడంలో విఫలం అవడం. అయితే కొన్ని విషయాలపై అవగాహన పొందడం ద్వారా ఇంటర్వ్యూని సులభంగా అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో గూగుల్ లో రిక్రూటర్ గా పనిచేసిన నోలన్ చర్చ్ కూడా ఇంటర్వ్యూకి వెళ్లే అభ్యర్థులకు కొన్ని టిప్స్ అందిస్తున్నారు. వాటిని ఫాలో అయితే ఇబ్బంది లేకుండా ఇంటర్వ్యూని క్రాక్ చేయొచ్చని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మిమ్మల్ని మీరు బూస్ట్ చేసుకోవద్దు..

“నేను చాలా కష్టపడి పని చేస్తాను” లేదా “నేను మిస్టర్ పర్ఫెక్షనిస్ట్” వంటి క్లిచ్ పదబంధాలతో కూడిన జవాబులు ఇంటర్వ్యూలో చెప్పొద్దు. మిమ్మల్ని అడిగిన ప్రశ్నలకు సూటిగా, స్పష్టంగా జవాబు చెప్పడం ఎంత అవసరమో.. అదే సమయంలో జెన్యూన్ గా సమాధానం చెప్పడం కూడా అంతే అవసరం. మీ ఫోకస్ అంతా నేర్చుకునే విధానంపైనే ఉండేటట్లు చూసుకోవాలి. గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకున్నపాఠాలను నిజ ఉదాహరణలతో వివరించాలి. తద్వారా ఎదిగిన విధానాన్ని తెలియజేయాలి. ఇది ఇంటర్వ్యూ చేసే వారికి మీపై సదాభిప్రాయాన్ని కలుగజేస్తుంది. ఏ రిక్రూటర్ అయినా మిమ్మల్ని పర్ఫెక్ట్ గా ఉండటానికి ఉద్యోగంలో తీసుకోడు.. తమ కంపెనీ ఎదుగుదలకు దోహదపడుతూ వారు ఎదిగే వారిని ఎంచుకుంటాయని నోలన్ చర్చ్ వివరించారు.

సహోద్యోగుల గురించి ప్రతికూలంగా మాట్లాడొద్దు..

మీరు ఒకవేళ ఒక కంపెనీలో పనిచేసి.. మరో కంపెనీ మారుతుంటే.. మాజీ సహోద్యోగులు, నిర్వాహకులు లేదా సంస్థల యాజమాన్యాల గురించి ప్రతికూలంగా మాట్లాడకుండా ఉండటం మేలు. ఇతరుల లోపాల ఎత్తి చూపడం అనేది మీ పాత్రను చెడుగా ప్రతిబింబిస్తుంది. జవాబుదారీతనం లేకపోవడాన్ని సూచిస్తుంది. అవకాశం ఉన్నంత వరకూ పాత సంస్థలో మీరు నేర్చుకున్న విషయాలు వివరించండి. అక్కడి అనుభవాలను హైలైట్ చేయండి. ఇది మీపై పాజిటివిటీని పెంచుతుంది. అలా అని అతిగా పాత కంపెనీ గురించి చెప్పకూడదు. వ్యతిరేక భావాలు వ్యక్తపరచకుండా ఉంటే మేలు. తమ తప్పులను తాము గుర్తించి.. వాటిని సరిదిద్దుకునేందుకు ప్రాధాన్యమిచ్చే వ్యక్తులను మేము టార్గెట్ చేస్తామని నోలన్ చర్చ్ వివరించారు.

సమాధానం తెలియకపోతే..

ఇంటర్వ్యూ చేసే వారు అడిగిన ప్రశ్నకు మీకు సమాధానం తెలియకపోతే “నాకు తెలియదు” అని చెప్పడం ఉత్తమం. అయితే అలా తెలియదు అని చెబుతూనే .. సమస్యను పరిష్కరించడానికి ఊహాజనిత విధానాలను అందించడం ద్వారా సమస్య పరిష్కార నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ చురుకైన వైఖరి, మీకు తెలియని పరిస్థితుల్లో కూడా మీరు వనరులను, సవాళ్లను అధిగమించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని యజమానులకు సంకేతాలు ఇస్తుంది.

ఇంటర్వ్యూ ప్రక్రియ అంతటిలో ప్రామాణికత, వినయం, సమస్య పరిష్కార సామర్థ్యాలను కొనసాగించడం మంచిదని చర్చ్ వివరిస్తున్నారు. ఈ లక్షణాలను ప్రభావవంతంగా తెలియజేయగల అభ్యర్థులు ఇంటర్వ్యూ చేసేవారికి సానుకూల ప్రభావం పడేలా చేస్తుందని ఆయన చెబుతున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.