OU PG EXAMS: విద్యార్థులకు ముఖ్య గమనిక.. పీజీ ఎగ్జామ్ డేట్స్ విడుదల చేసిన ఉస్మానియా యూనివర్సిటీ..
ఉస్మానియా యూనివర్సిటీ వివిధ పీజీ కోర్సుల పరీక్షల షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేసింది. కరోనా ప్రభావంతో నిలిచిపోయిన పీజీ పరీక్షలను నిర్వహించేందుకు
ఉస్మానియా యూనివర్సిటీ వివిధ పీజీ కోర్సుల పరీక్షల షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేసింది. కరోనా ప్రభావంతో నిలిచిపోయిన పీజీ పరీక్షలను నిర్వహించేందుకు యూనివర్సిటీలు, విద్యా సంస్థలు పరీక్షల్ని నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నాయి.. ఈ క్రమంలోనే ఉస్మానియా పరిధిలో జరిగే పీజీ పరీక్షలు మార్చి 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా.. MSC, MA, MCom, MSW, MLibISc, BLibSc, MJ&MC, MCom (IS) మూడవ సెమిస్టర్, రెగ్యులర్ పరీక్షలు మార్చి 19 నుంచి 17 వరకు జరగనున్నాయి.
కరోనా ప్రభావంతో మూతపడిన కాలేజీలు, స్కూల్స్ ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. ఇక సాధ్యమైనంత వరకు అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం సూచించగా.. కాలేజీ యాజమాన్యాలు అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. పరీక్షలకు హజరయ్యే విద్యార్థులు కోవిడ్ 19 నిబంధనల్ని పాటించాలి. మాస్కులు ధరించడం, హ్యాండ్ వాష్ చేసుకోవడం, శానిటైజర్లు ఉపయోగించడం లాంటి జాగ్రత్తలతో పాటు సోషల్ డిస్టెన్సింగ్ పాటించాల్సి ఉంటుంది. ఎగ్జామ్ హాల్ ను శానిటైజ్ చేసి.. ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా బెంచ్‌కు ఒక స్టూడెంట్ ఉండేలా చర్యలు తీసుకోనుంది. ఎగ్జామినేషన్ సెంటర్లలోని చీఫ్ సూపరింటెండెట్స్ కోవిడ్ 19 ప్రోటోకాల్స్‌ని పాటిస్తూ ఈ పరీక్షల్ని నిర్వహించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర విద్యా శాఖ సూచించిన కోవిడ్ 19 నియమనిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలి.
ఇదిలా ఉండగా.. ఇప్పటికే టెన్త్ పరీక్షల షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది. టెన్త్ క్లాస్ విద్యార్థులకు మే 3 నుంచి 8వ తేదీ వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈసారి పరీక్ష విధానాన్ని మార్చినందున కొశ్చన్ పేపర్స్‌ను కొత్తగా రూపొందించి స్కూళ్లకు పంపిచనున్నారు. అలాగే.. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (SCERT) మోడల్ కొశ్చన్ పేపర్స్‌ని ఇటీవల విడుదల చేసింది. విద్యార్థులు వాటిని https://www.scert.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
Also Read:
Yoga Benefits: యోగా చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలుయో తెలుసా.. అధ్యయనంలో బయటపడ్డ మరిన్ని విషయాలు..