Yoga Benefits: యోగా చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలుయో తెలుసా.. అధ్యయనంలో బయటపడ్డ మరిన్ని విషయాలు..

ప్రస్తుత హడావిడి జీవితంలో ప్రతి ఒక్కరు ప్రశాంతకు దూరమవడమే కాకుండా.. తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. దీని వలన ఎన్నో శారీరక సమస్యలు, మానసిక సమస్యలను ఎదుర్కోంటున్నారు.

  • Rajitha Chanti
  • Publish Date - 1:48 pm, Sat, 27 February 21
Yoga Benefits: యోగా చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలుయో తెలుసా.. అధ్యయనంలో బయటపడ్డ మరిన్ని విషయాలు..

ప్రస్తుత హడావిడి జీవితంలో ప్రతి ఒక్కరు ప్రశాంతకు దూరమవడమే కాకుండా.. తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. దీని వలన ఎన్నో శారీరక సమస్యలు, మానసిక సమస్యలను ఎదుర్కోంటున్నారు. అలా కాకుండా ప్రశాంతమైన జీవితం, ఒత్తిడిని అధిగమించేందుకు యోగా ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. తీవ్ర నిరాశ, అలసటలకు లోనయినప్పుడు యోగా చాలా ప్రయోజనం చేకూరుస్తుందని ఇటీవలే ఓ పరిశోధనలో కూడా తేలింది. రోజూలో ఒక్కసారి యోగా చేసిన వారు రోజంతా ఉత్సహంగా ఉంటున్నారట. అలాగే వారికి ఒత్తిడి సమస్య, ఆందోళన కూడా తక్కువగా ఉంటుందని తేలింది. అంతాకాక‌ వీరు ఎంతో ప్రశాంతంగా ఉంటున్నారట. ఇక మార్చి నెలలో దేశ‌వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ (Lockdown) స‌మ‌యంలో ఐఐటి ఢిల్లీ (IIT Delhi) నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు బయటపడ్డాయి. అయితే ఇందులో ఇత‌ర శారీర‌క వ్యాయామాలు (exercise) చేసేవారిలో కూడా ఇలాంటి ప‌రిస్థితే అనే విషయాన్ని మాత్రం చెప్పలేకపోయింది. ఇక ఐఐటి ఢిల్లీకి చెందిన నేష‌న‌ల్ రిసోర్స్ సెంట‌ర్ ఫ‌ర్ వ్యాల్యూ ఎడ్యుకేష‌న్ ఇన్ ఇంజినీరింగ్ (ఎన్ఆర్‌సివిఈఈ) శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.

లాక్‌డౌన్ సమ‌యంలో ఒత్తిడి నిర్వహణ, ప్రశాంత జీవ‌నంపై చేసిన ఈ స‌ర్వేలో 396 మంది యోగా చేస్తుండగా.. 113 మంది `ఆధ్యాత్మిక‌` (spiritual) సాధన చేసేవారి చేసేవారు. ఇక 134 మంది ఏ సాధన చేయకుండా ఉండేవారి మధ్య ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో చాలా కాలం నుంచి యోగా చేస్తున్న వారిలో (5 ఏళ్ల కంటే ఎక్కువ‌), మ‌ధ్య‌స్థ (1 నుంచి 4 ఏళ్లు), ప్రారంభ ద‌శ (లాక్‌డౌన్‌లో మొద‌లుపెట్టిన‌వారు) అని విభ‌జ‌న‌ చేశారు. అధ్య‌య‌నం ప్ర‌కారం దీర్ఘ‌కాలం యోగా సాధ‌న చేస్తున్న‌వారిలో స్వీయ నియంత్ర‌ణ ఎక్కువ‌గా ఉండి, అనారోగ్య లక్షణాలు త‌క్కువ‌గా ఉన్నాయి. ఇంకా దీర్ఘ‌కాల‌, మ‌ధ్య‌స్థ గ్రూపుల‌కు చెందిన‌ ప్రాక్టీష‌న‌ర్ల ఫ‌లితాల‌ను బ‌ట్టి కోవిడ్‌-19లో జీవితం సాధార‌ణంగానే ఉన్నట్లు భావావేశాల ప్రభావం త‌క్కువ‌గా ఉన్నట్లు తెలిసింది. అంతేకాక‌, త‌ర్వాత కాలంలో ఎక్కువ మ‌న‌శ్శాంతి, త‌క్కువ డిప్రెష‌న్, ఆందోళ‌న ఉన్నట్లు తెలిపింది. ఈ రెండు గ్రూపుల వారు రోజూ యోగా చేయ‌డం వ‌ల్ల వారి వ్యాధి నిరోధ‌క శ‌క్తిపై న‌మ్మకంగా ఉన్నారు. . ఇటీవ‌ల ఇది `ప్లస్ ఒన్‌` జ‌ర్నల్ లో ఇది ప్రచురితం అయ్యింది. డాటాను 26 ఏప్రిల్ 2020 నుంచి 8 జూన్ 2020 వ‌ర‌కూ ఆన్‌లైన్లో ఉంచిన ప్రశ్నావళి ద్వారా సేక‌రించారు.

ఈ యోగా చేసేవారిలోనూ దీర్ఘకాలం అంటే (5 ఏళ్ల కంటే ఎక్కువ‌), మ‌ధ్యస్థ (1 నుంచి 4 ఏళ్లు), ప్రారంభ ద‌శ (లాక్‌డౌన్‌లో మొద‌లుపెట్టిన‌వారు) అని మూడు భాగాలుగా విభజించారు. అధ్యయనం ప్రకారం ఎక్కువ కాలం నుంచి యోగా చేస్తున్నవారిలో స్వీయ నియంత్రణ ఎక్కువగా ఉంటుందని.. అనారోగ్య లక్షణాలు తక్కువగా ఉన్నాయని పేర్కోంది. ఇక మధ్యస్థ.. ప్రారంభదశలో ఉన్నవారిలో లక్షణాలు మాములుగా ఉన్నట్లు తెలిపింది. ఇక అసలు యోగా చేయని వారిలో ఒత్తిడి, ఆందోళన ప్రభావం ఎక్కువగా ఉందని.. దీంతో వీరు తొందరగా ఆందోళన చెందుతారని.. అనారోగ్య సమస్యల భారిన పడుతుంటారని పేర్కోంది. ఇటీవ‌ల ఇది `ప్లస్ ఒన్‌` జ‌ర్నల్‏లో ప్రచురితమయ్యింది. ఈ డాటాను 26 ఏప్రిల్ 2020 నుంచి 8 జూన్ 2020 వ‌ర‌కూ ఆన్‌లైన్లో ఉంచిన ప్రశ్నావలి ద్వారా సేక‌రించారు. యోగా కాకుండా ఇత‌ర శారీర‌క వ్యాయామాలు చేసిన వారికి ఇలాంటి ఫ‌లితాలే వ‌చ్చాయా అనేది ఈ అధ్యాయనంలో వెల్లడంచలేదు. గతంలో నిర్వహించిన అధ్యాయనాల్లో శారీర‌క వ్యాయామాల వ‌ల్ల కరోనా ప్రభావం నుంచి మెరుగైన ఫ‌లితాలు వ‌చ్చిన‌ట్లు తెలిసింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివ‌ర్ అండ్ బైలియ‌రీ సైన్సెస్ కు చెందిన యోగా ప్రకృతి వైద్య ర‌చ‌యిత అయిన‌ డాక్టర్ ఆబీ ఫిలిప్స్ అభిప్రాయపడ్డారు.

Also Read:

సోంపు నోటి దుర్వాసనను పోగొట్టమే కాదు.. 8 రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.. ఎంటో తెలుసా..