Oil India Limited Jobs: నెలకు రూ. 2 లక్షల జీతంతో.. ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో గ్రేడ్ బి,సీ ఉద్యోగాలు..!
భారత ప్రభుత్వ రంగానికి చెందిన అస్సాంలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ (Oil India Limited).. గ్రేడ్ బీ, సీ పోస్టుల (Grade B and C Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
Oil India Limited Grade B, C Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన అస్సాంలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ (Oil India Limited).. గ్రేడ్ బీ, సీ పోస్టుల (Grade B and C Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 55
పోస్టుల వివరాలు:
- మేనేజర్: 1
- సూపరింటెండెన్‌డింగ్ ఇంజనీర్: 2
- సూపరింటెండెన్‌డింగ్ మెడికల్ ఆఫీసర్: 2
- సీనియర్ మెడికల్ ఆఫీసర్: 1
- సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్: 1
- సీనియర్ ఆఫీసర్లు: 43
- సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్: 5
విభాగాలు: ఎన్విరాన్‌మెంట్, రేడియాలజీ, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, పబ్లిక్ అఫైర్స్ తదితర విభాగాల్లో ఖాళీలను పూరించనున్నారు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 27 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: గ్రేడ్ సీ పోస్టులకు నెలకు రూ.80,000ల నుంచి రూ.2,20,000లు, గ్రేడ్ బి పోస్టులకు నెలకు రూ.60,000ల నుంచి రూ.1,80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంబీఏ, పీజీ డిగ్రీ, ఎంబీబీఎస్, ఎండీ/డీఎన్‌బీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధులకు టెక్నికల్ నాలెడ్జ్ అవసరం.
ఎంపిక విధానం: రాత పరీక్ష, గ్రూప్ డిస్‌కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
- జనరల్/ఓబీజీ అభ్యర్ధులకు: రూ.500
- ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈడబ్ల్యూఎస్/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 15, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: