AIISH Jobs: నెలకు రూ.39,000ల జీతంతో.. 49 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!
భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన మైసూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ (AIISH) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
AIISH Mysore Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన మైసూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ (AIISH) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 49
పోస్టుల వివరాలు: స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్, ఆడియాలజిస్ట్, స్పీచ్ ఆండ్ హియరింగ్ టెక్నీషియన్
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: ఆడియాలజిస్ట్ పోస్టులకు నెలకు రూ.39,000లు, స్పీచ్ ఆండ్ హియరింగ్ టెక్నీషియన్ పోస్టులకు నెలకు రూ. రూ.22,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా, ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఏఐఐఎస్‌హెచ్, మానసగంగోత్రి, మైసూర్ 570006.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: