SAI Jobs: నేరుగా ఇంటర్వ్యూతోనే..60 వేల జీతంతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..
భారత ప్రభుత్వ రంగానికి చెందిన యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ (Ministry of Youth Affairs and Sports)కు చెందిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) ఒప్పంద ప్రాతిపదికన మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
SAI Manager (Athlete Relations) Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ (Ministry of Youth Affairs and Sports)కు చెందిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) ఒప్పంద ప్రాతిపదికన మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: Manager (Athlete Relations)
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 32 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.40,000ల నుంచి రూ.60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: స్పోర్ట్స్/లా/మేనేజ్‌మెంట్ విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ లేదా బీటెక్/ఎంబీఏతోపాటు స్పోర్స్ మేనేజ్‌మెంట్‌లో 2 ఏళ్ల పీజీ డిప్లొమా చేసి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం సంవత్సరం పాటు అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 13, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: