Knowledge: ఎంత పెద్ద వానలోనైనా ప్రతి చినుకును తప్పించుకుని తడవకుండా గూటికి చేరే ఏకైక పక్షి ఏదో తెలుసా?

పుస్తకాల్లో చెప్పని, పెద్దల నోట వినని వింత విషయాలు కొన్ని ఉన్నాయీ జిందగీలో! అవేంటో తెలిస్తే ఔరా.. అనక మానరు. సాధారణంగా మన దేశంలో ఏదైనా హోటల్‌కి వెళ్తే టిప్‌ ఇవ్వడం ఆనవాయితీ.. అంతేకాదు..

Knowledge: ఎంత పెద్ద వానలోనైనా ప్రతి చినుకును తప్పించుకుని తడవకుండా గూటికి చేరే ఏకైక పక్షి ఏదో తెలుసా?
Gk
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 22, 2022 | 8:33 PM

Mind-Blowing Facts in Telugu: పుస్తకాల్లో చెప్పని, పెద్దల నోట వినని వింత విషయాలు కొన్ని ఉన్నాయీ జిందగీలో! అవేంటో తెలిస్తే ఔరా.. అనక మానరు. సాధారణంగా మన దేశంలో ఏదైనా హోటల్‌కి వెళ్తే టిప్‌ ఇవ్వడం ఆనవాయితీ.. అంతేకాదు అధిక మొత్తంలో టిప్‌ ఇచ్చినందుకు వెయిటర్‌ ఒంగివంగి సలాం కొట్టడం కూడా చాలా సందర్భాల్లో అనుభవమే కదా! కానీ ఈ దేశంలో టిప్‌ ఇచ్చారంటే చాలు.. వెయిటర్లు చాలా అవమానంగా భావిస్తారట. పొరబాటున అక్కడికి వెళ్తే ఏ హోటల్లోనూ టిప్‌ ఇవ్వకండే! ఇంత విచిత్రమైన పద్ధతులున్న ఆ దేశం ఏదో తెలుసుకోవాలనుందా.. అంతేకాదు, వెక్కిళ్లు రాని మనిషంటూ ఈ భూమి మీద ఎవ్వరుండరు. ఒక్కోసారి ఎక్కువ టైం వెక్కిళ్లు వేధిస్తాయి. అప్పుడు ఏం చేస్తే క్కిళ్లు తగ్గుతాయో తెలుసా? స్పేస్‌లోకి వెళ్లేముందు వ్యోమగాములు ఈ కూరగాయలు అస్సలు తినరట.. ఇంకా ప్రపంచంలో ఎక్కువమందికి ఉండే పేరేంటో తెలుసా? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలు మీకోసం..

  • ప్రపంచంలో చమురును అధికంగా ఎగుమతి చేసే దేశం నార్వే
  • పెంగ్విన్‌ పక్షులు దంతాలు లేకపోయినా కరవగలవు
  • 1992 నుంచి MMSలు పంపే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
  • రోజుకి అంతరిక్షం నుంచి 2 వేల పౌండ్ల దుమ్ము, ధూళి భూమిపైకి చేరుకుంటుంది.
  • అంతరిక్షానికి వెళ్లే వ్యోమగాములు ఆ ప్రయాణానికి ముందు బీన్స్‌ తినరు.
  • అమెరికన్లు ప్రతి సంవత్సరం తినే అరటిపండ్ల సంఖ్య ఏంతో తెలుసా..?! 1,100 కోట్లు అట..!
  • ఆరోగ్యవంతమైన మనిషి రోజుకు పదమూడుసార్లు నవ్వుతాడట తెలుసా..?
  • గులాబీ మొక్కలు 20 కోట్ల ఏళ్లనుండీ పుష్పిస్తున్నాయట..!
  • అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.
  • కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
  • ఐస్‌లాండ్ దేశంలో హోటల్ వెయిటర్లు టిప్ తీసుకోవడాన్ని అవమానంగా భావిస్తారట. భలే బాగుంది కదూ..!
  • వెనిజులాకు చెందిన ఒక జాతి గబ్బిలం హోరున వర్షం పడుతున్నపుడు కూడా ప్రతీ చినుకునూ తప్పించుకుంటూ తన గూటికి తడవకుండా చేరగలుగుతుందట.
  • న్యూజిలాండ్‌లోని “కీ” అనే పక్షి కారు కిటికీల చుట్టూ అమర్చే రబ్బరును తినేందుకు అమితంగా ఇష్టపడుతుందట.
  • ఒక వయోలిన్ తయారు చేయడానికి 70 వేర్వేరు కలప ముక్కల్ని ఉపయోగిస్తారు.
  • ప్రపంచంలో ఎక్కువమందికి ఉన్న మొదటి పేరు మహమ్మద్.
  • నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
  • గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
  • అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.
  • జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.
  • బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.
  • సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.
  • జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
  • ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.

Also Read:

Oil India Limited Jobs: నెలకు రూ. 2 లక్షల జీతంతో.. ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో గ్రేడ్‌ బి,సీ ఉద్యోగాలు..!