NTRO Recruitment: నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
NTRO Recruitment: నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. న్యూఢిల్లీలో ఉన్న ఈ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్/ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఖాళీలను..
NTRO Recruitment: నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. న్యూఢిల్లీలో ఉన్న ఈ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్/ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 206 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్, రిస్క్ అనలిస్ట్, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, టీమ్ లీడర్, హార్డ్‌వేర్ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ వంటి ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత టెక్నికల్ నాలెడ్జ్‌తో పాటు పని అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 30 నుంచి 62 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను క్వాలిటీ అండ్ కాస్ట్ బేస్డ్ సెలక్షన్ మెథడ్(క్యూసీబీఎస్) ఆధారంగా ఎంపికచేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ 22-04-2022న ప్రారంభమవుతుండగా 16-05-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: CMFRI Kochi Recruitment 2022: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగావకాశాలు.. RBI revises bank timings: బ్యాంక్ కస్టమర్లకు ‘బిగ్ అలర్ట్’.. టైమింగ్స్ మారాయి.. పూర్తివివరాలివే..!
Acharya: మెగా అభిమానులకు కనుల పండువ.. అన్న కోసం తమ్ముడు.. ఒకే వేదికపై మెగా హీరోల సందడి..