Women’s Day 2022: ఉద్యోగాల్లో లింగ అసమానత.. మెటర్నిటీ లీవ్‌ తర్వాత మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సవాళ్లు!

అన్ని వర్క్‌ప్లేస్‌లలో మహిళలకు అనుకూలమైన వాతావరణం ఖచ్చితంగా ఉండదు. ఎన్నో ఏళ్లగా హెచ్‌ఆర్ పాలసీల్లో అధిక శాతం మహిళల కంటే పురుషులకే ఎక్కువ ప్రయోజనకారిగా ఉన్నాయి..

Women's Day 2022: ఉద్యోగాల్లో లింగ అసమానత.. మెటర్నిటీ లీవ్‌ తర్వాత మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సవాళ్లు!
Working Women
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 11, 2022 | 6:06 AM

women employees: పనిచేసేచోట ఎదురయ్యే సవాళ్లు, అడ్డంకులను అధిగమించి మహిళలు తమ ఉద్యోగాల్లో నిలకడగా ఉంటున్నారా? లేక విడిచిపెట్టి వెళ్తున్నారా? అనే విషయంపై సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ డేటా అండ్‌ అనాలిసిస్‌ (CMIE) సర్వే నిర్వహించి డేటాను సేకరించింది. వీటితోపాటు గత కొన్నేళ్లుగా పరిస్థితి మెరుగుపడిందా లేక కోవిడ్‌ మహమ్మారి వల్ల పరిస్థితి మరింత దిగజారిందా అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి వర్కింగ్‌ ఉమెన్‌, జాబ్ మానేసిన మహిళలను సర్వే చేశారు. ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

2019 – 2021 మధ్యకాలంలో ప్రతి నెలా ఉద్యోగ ప్రయత్నాలు చేసే మహిళల సంఖ్య మూడు మిలియన్లకు తగ్గిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE), సెంటర్ ఫర్ ఎకనామిక్ డేటా అండ్ అనాలిసిస్ (CEDA) బులెటిన్ తెల్పింది. 2019తో పోల్చితే 2021లో పట్టణ ప్రాంతాల్లో 22.1 శాతం మంది మహిళలు ఉద్యోగాలు సంపాదించారని డేటా తెల్పుతోంది. అదే 2019లో ప్రతి నెలా 9.52 మిలియన్ల మంది మహిళలు ఉద్యోగాల వేటలో ఉండగా, 2021లో ఈ సంఖ్య 6.52 మిలియన్లకు పడిపోయింది. మేల్‌ వర్క్‌ ఫోర్స్‌ 2021లో పట్టణ ప్రాంతాల్లో 19.7 ఉద్యోగాల కోసం వెతుకులాట ప్రారంభించగా, గ్రామీణ ప్రాంతాల్లో 14.9 శాతం (2019తో పోలిస్తే) పెరిగింది.ఇక మహిళల విషయానికొస్తే..దేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చాలా తక్కువ మంది మహిళలు మాత్రమే ఉద్యోగ ప్రయత్నాలు చేశారట. పట్టణ ప్రాంతాల్లో 2019లో 3.87 మిలియన్ల (33.7 శాతం క్షీణత)తో పోలిస్తే 2021లో ప్రతి నెలా కేవలం 2.57 మిలియన్ల మంది మహిళలు మాత్రమే ఉద్యోగాల కోసం చురుకుగా వెతికారు. గ్రామీణ ప్రాంతాల్లోనైతే 2020లో 5.16 మిలియన్లతో పోలిస్తే 2021లో కేవలం 3.95 మిలియన్ల (23.5 శాతం తక్కువ) మంది మహిళలు మాత్రమే ఉద్యోగ ప్రయత్నాలు చేశారు.

ఉద్యోగాల నియామకాల్లో లింగ అసమతుల్యత ఉన్నట్లు 2021 లింక్డ్‌ఇన్ అధ్యయనంలో స్పష్టంగా వెల్లడైంది. జాబ్‌ ఆఫర్స్ వేగంగా పెరుగుతున్న15 రకాల ఉద్యోగాల్లో.. సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ (79 శాతం), మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ (78 శాతం), మార్కెటింగ్ అండ్‌ అడ్వర్టైజింగ్ రోల్‌ (68 శాతం), మీడియా బైయర్‌ (67 శాతం) వంటి ఐటీ ఉద్యోగాల్లో 70 శాతం మంది పురుషులు నియమితులయ్యారు. ఇక మహిళల విషయానికొస్తే.. ఎక్కువ మంది వెల్‌నెస్ స్పెషలిస్ట్‌లుగా (54 శాతం), యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ రీసెర్చర్లుగా (60 శాతం), రిక్రూట్‌మెంట్ అసోసియేట్లుగా (68 శాతం), స్ట్రాటజీ అసోసియేట్‌లుగా (60 శాతం) నియమితులౌతున్నారు.

ఉద్యోగాల్లో చేరడానికి మహిళలు ఎందుకు వెనుకాడుతున్నారు? అన్ని వర్క్‌ప్లేస్‌లలో మహిళలకు అనుకూలమైన వాతావరణం ఖచ్చితంగా ఉండదు. ఎన్నో ఏళ్లగా హెచ్‌ఆర్ పాలసీల్లో అధిక శాతం మహిళల కంటే పురుషులకే ఎక్కువ ప్రయోజనకారిగా ఉన్నాయి. మా వర్క్‌ఫోర్స్‌లో ఎక్కువ మంది మహిళలను నియమించుకోవాలంటే మరిన్ని సురక్షితమైన పాలసీలు రూపొందించవల్సి ఉంటుందని జేపీ మోర్గాన్ చేజ్‌లో సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ ఉద్యోగి అయిన నీతూ అహుజా అంటున్నారు. తన కంపెనీలో అట్రిషన్‌గా పనిచేస్తున్నవారిలో ఎక్కువగా మహిళా ఉద్యోగులే ఉన్నారన్నారు. అందుకు అతిపెద్ద కారణం ఏమిటంటే.. కేవలం వర్క్‌ మీదనే ఫోకస్‌ పెట్టేలా చేయడంలో మహమ్మారి మహిళలకు పెద్ద అడ్డంకిగా పరిణమించింది. ఎక్కడినుంచైనా పనిచేయడం అనేది సౌకర్యవంతమైన పద్ధతి అయినప్పటికీ మహిళలు మల్టీ టాస్కులు చేయవల్సి వస్తోంది. ఫలితంగా వాళ్లు స్ట్రెస్‌ భరించలేక తాము చేస్తున్న ఉద్యోగాలను వదిలిపెట్టేస్తున్నారు. ఇటువంటి ఉద్యోగుల కోసం మీరేమైనా చేస్తున్నారా? అనే ప్రశ్నకు.. దురదృష్టవశాత్తు ఏమీ చేయట్లేదని ఆమె సమాధానం ఇచ్చారు.

మాతృత్వం పెద్ద సవాల్.. మహిళలు ఉద్యోగాల్లో కొనసాగడానికి మాతృత్వం కూడా ఒక సవాలేనని సర్వే వెల్లడించింది. ప్రసూతి సెలవు తర్వాత కూడా పనిని కొనసాగించడానికి ఇంట్లోని కుంటుంబ సభ్యులనుంచి వారికి తగినంత మద్దతు లభించనందువల్ల దాదాపు 20 శాతం మంది మహిళలు జాబ్స్‌ విడిచిపెడుతున్నట్లు తెలిపారు. మెటర్నిటీ సెలవుల తర్వాత కూడా వారి నుంచి గతంలో మాదిరిగానే అత్యుత్తమ పనితీరును తిరిగి కనబరచడానికి వారికి అవసరమైన సెలవులను ఇచ్చినప్పటికీ, ఇంతకు ముందు చేసినట్లు తమ పని చేయలేక పోతున్నారు. ఫ్లెక్సిబిలిటీ అనే విధానం వల్ల కూడా మహిళలు తమ పనిని కొనసాగించడం అసాధ్యంగా భావిస్తున్నారు. శీతల్ అహుజా బిడ్డను ప్రసవించిన తర్వాత 2021లో న్యూఢిల్లీలో ఐసీఐసీఐ బ్యాంక్‌లో పని చేయడం మానేసింది. ప్రసూతి సెలవులవల్ల (maternity leave) ఇంక్రిమెంట్ సైకిల్‌ను కోల్పోవడం పెద్ద సవాలు. సెలవు తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరాక annual appraisalకు నన్ను పరిగణనలోకి తీసుకోరని తెలిసింది. 3rd Month వరకు నేను కంపెనీ కోసం పనిచేసినప్పటికీ వాస్తవాన్ని కంపెనీ గుర్తించలేదని, ఫలితంగా ఐటీ కన్సల్టెన్సీ కంపెనీలో ఉద్యోగాన్ని వదులుకోవల్సి వచ్చిందని షెఫాలీ జైన్ తన అనుభవాన్ని పంచుకున్నారు.

మహిళలు తమ ఉద్యోగాలను విడిచిపెట్టడానికి ఇంకా ఇతర కారణాలు ఏమిటంటే.. రీలొకేషన్‌ (18 శాతం), స్వచ్ఛంద నిష్క్రమన (18 శాతం), వివాహం (15 శాతం), ఉన్నత చదువులను అభ్యసించడానికి (11 శాతం). ఉద్యోగాల లభ్యత, సరైన మద్దతు లేకపోవడం వంటి కారణాలు కూడా చెప్పుకొదగ్గ కారణాలే. సర్వేలో పాల్గొన్న దాదాపు 85 శాతం మంది మహిళలు తమ ఆఫీసుల్లో ఎదురయ్యే మార్పులను స్పష్టంగా తెలుసుకోగలరు. ఎందుకంటే మహిళలకు వారి హక్కుల గురించి బాగా తెలుసు. డబ్బు, ఇంక్రిమెంట్లు, బోనస్, ఫ్లెక్సిబుల్ టైమింగ్‌లు, ప్రొఫైల్‌లు మొదలైన వాటి పరంగా అర్హత కలిగిన వాటిని డిమాండ్ చేయడానికి భయపడరు. ఈ కారణాల రిత్యా మహిళా ఉద్యోగులకు జరుగుతున్న నష్టాన్ని హెచ్‌ఆర్‌ కూడా గమనించడం ప్రారంభించింది. ఇది ఒక విష వలయం. చాలా వరకు మహిళలకు అనుకూలమైన వర్క్‌ప్లేస్ విధానాలు కూడా అమల్లోకి వచ్చాయని నోయిడాలోని ITES కంపెనీ అడ్మిన్ హెడ్ రీతు డిసౌజా అంటున్నారు.

టాక్సిక్‌ వర్కింగ్ కండీషన్లు, సెక్సిజం కొన్ని రంగాల్లో ఇంకా ఉన్నాయని, వీటివల్ల ఉమెన్‌ వర్కర్లు అభివృద్ధి చెండడం, ఎదగడం అసాధ్యమని 15 శాతం మంది మహిళలు సర్వేలే వెల్లడించారు.

Also Read:

CIPET Hyderabad Jobs: బీటెక్‌/ఎంటెక్‌ అర్హతతో.. సీపెట్‌ హైదరాబాద్‌లో లెక్చరర్‌ పోస్టులు..రాత పరీక్షలేకుండానే ఎంపిక!

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు