NMDC Recruitment: ఎన్‌ఎండీసీలో అప్రెంటిస్ పోస్టులు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థుల ఎంపిక..
NMDC Recruitment: నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ సంస్థలో పలు అప్రెంటిస్ పోస్టులను..
NMDC Recruitment: నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ సంస్థలో పలు అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 59 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ట్రేడ్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్‌లు ఉన్నాయి.
* ట్రేడ్ అప్రెంటిస్ 30 (కోపా), గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 16 (మెకానికల్ ఇంజినీర్ 6, ఎలక్ట్రికల్ ఇంజినీర్ 3, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రాన్ ఇంజినీరింగ్ 1, మైనింగ్ ఇంజినీరింగ్ 4, సివిల్ ఇంజినీరింగ్ 2, టెక్నీషియన్ అప్రెంటిస్ 13 (మెకానికల్ ఇంజినీర్ 5, ఎలక్ట్రానిక్ ఇంజినీర్ 2, ఎలక్ట్రాన్ అండ్ టెలికమ్ ఇంజినీరింగ్ 1, మైనింగ్ ఇంజినీరింగ్ 1, ఎంఓఎం 3, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ 1) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత ట్రేడ్ లేదా బ్రాంచీలో ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా చేసి ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్‌లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులు ఛత్తీస్‌ఘఢ్‌లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
* ఇంటర్వ్యూలను ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, బీఐఓఎమ్, బచేలి, దంతేవాడ, ఛత్తీస్‌ఘఢ్ అడ్రస్‌లో నిర్వహించనున్నారు.
* జనవరి 20,21,22,23,24 తేదీల్లో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Coronavirus: బాలీవుడ్‌లో ఆగని కరోనా ప్రకంపనలు.. వైరస్ బారిన పడిన బాహుబలి ‘మనోహరి’