NIMS Recruitment: హైద‌రాబాద్ నిమ్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.80 వేలు జీతం పొందే అవ‌కాశం..

NIMS Recruitment: నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (NIMS) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. హైద‌రాబాద్ పంజాగుట్ట‌లో ఉన్న ఈ వైద్య సంస్థ‌లో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.?

NIMS Recruitment: హైద‌రాబాద్ నిమ్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.80 వేలు జీతం పొందే అవ‌కాశం..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 18, 2022 | 5:41 PM

NIMS Recruitment: నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (NIMS) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. హైద‌రాబాద్ పంజాగుట్ట‌లో ఉన్న ఈ వైద్య సంస్థ‌లో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివ‌రాలు మీకోసం…

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 04 సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* అనెస్తీషియాలజీ, జనరల్‌ మెడిసిన్‌, ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ (ఎండీ) ఉత్తీర్ణత పొంది ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తుల‌ను డీన్‌, నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, పంజాగుట్ట, హైదరాబాద్‌ – 500082 అడ్ర‌స్‌కు పంపించాలి.

* ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ. 80,000 జీతంగా అందిస్తారు.

* అభ్య‌ర్థుల‌ను ముందుగా ప‌ని అనుభ‌వం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంత‌రం ఇంట‌ర్వ్యూ ఆధారం తుది ఎంపిక ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ 28-01-2022తో ముగియ‌నుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Bangarraju: ఆ విష‌యంలో స‌క్సెస్ అయిన నాగార్జున‌.. బాక్సాఫీస్ ముందు బంగార్రాజు హ‌వా..

TDP Vs YCP: డైలీ సీరియల్ని తలపిస్తున్న అనంత రాజకీయం.. కొనసాగుతున్న మాటల యుద్ధం..

Tdp vs Ycp: పరిటాల వర్సెస్ తోపుదుర్తి బ్రదర్స్.. రాప్తాడులో ఫ్యాక్షన్‌ను మించిన పొలిటికల్ ఫైట్..