Bangarraju: ఆ విష‌యంలో స‌క్సెస్ అయిన నాగార్జున‌.. బాక్సాఫీస్ ముందు బంగార్రాజు హ‌వా..

Bangarraju: క‌రోనా థార్డ్ వేవ్ సినీ ప‌రిశ్ర‌మ‌పై తీవ్ర ప్ర‌భావం చూపింది. టాలీవుడ్‌కు పెట్టింది పేరైన సంక్రాంతికి విడుద‌ల కావాల్సిన ఆర్ఆర్ఆర్‌, రాధేశ్యామ్ వంటి భారీ చిత్రాలు వాయిదా వేసుకున్నాయి. వీటితో పాటు ఇత‌ర భాష‌ల‌కు చెందిన కొన్ని చిత్రాలు సైతం సంక్రాంతి..

Bangarraju: ఆ విష‌యంలో స‌క్సెస్ అయిన నాగార్జున‌.. బాక్సాఫీస్ ముందు బంగార్రాజు హ‌వా..
Follow us

|

Updated on: Jan 18, 2022 | 3:44 PM

Bangarraju: క‌రోనా థార్డ్ వేవ్ సినీ ప‌రిశ్ర‌మ‌పై తీవ్ర ప్ర‌భావం చూపింది. టాలీవుడ్‌కు పెట్టింది పేరైన సంక్రాంతికి విడుద‌ల కావాల్సిన ఆర్ఆర్ఆర్‌, రాధేశ్యామ్ వంటి భారీ చిత్రాలు వాయిదా వేసుకున్నాయి. వీటితో పాటు ఇత‌ర భాష‌ల‌కు చెందిన కొన్ని చిత్రాలు సైతం సంక్రాంతి (Sanktranti 2022) బ‌రి నుంచి త‌ప్పుకున్నాయి. దీంతో అనుకోకుండా కొన్ని చిన్న సినిమాలు తెర‌పైకి వ‌చ్చి. సంక్రాంతికి సంద‌డి చేసే ప్ర‌య‌త్నం చేశాయి. అయితే వీటి మ‌ధ్య‌లో విడుద‌లైంది బంగార్రాజు (Bangarraju) చిత్రం. నిజానికి క‌రోనా లాంటి ప‌రిస్థితుల్లో ఎప్పుడు క‌ఠిన ఆంక్ష‌లు విధిస్తారో తెలియని అనుమానాల నేప‌థ్యంలో ధైర్యంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది బంగార్రాజు టీమ్‌. త‌మ సినిమాను ఎట్టి ప‌రిస్థితుల్లో వాయిదా వేసేది లేద‌ని తేల్చి చెప్పి మ‌రీ ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందు తీసుకొచ్చారు కింగ్ నాగార్జున‌ (Nagarjuna). సొగ్గాడే చిన్ని నాయ‌న చిత్రానికి సీక్వెల్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో నాగ‌చైత‌న్య, కృతిశెట్టి, నాగార్జున‌, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన విష‌యం తెలిసిందే.

ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం బంగార్రాజు థియేట‌ర్ల వ‌ద్ద రాబ‌డుతోన్న వ‌సూళ్ల‌ను చూస్తుంటే నాగార్జున విజ‌యం సాధించిన‌ట్లే అనిపిస్తోంది. దీనికి కార‌ణం సంక్రాంతికి విడుద‌లైన ఏ సినిమా బంగార్రాజుకు స‌రైన పోటీ ఇవ్వ‌క‌పోవ‌డం ఒక‌టైతే.. అంద‌రూ ఊహించిన‌ట్లు ఇంకా క‌రోనా ఆంక్ష‌లు విధించక‌పోవ‌డం. దీంతో సంక్రాంతికి వినోదం కోసం చూసిన ప్రేక్ష‌కుల‌కు బంగార్రాజు ఒక్క‌టే ఆప్ష‌న్‌గా క‌నిపించింది. దీంతో ప్ర‌స్తుతం ఈ సినిమా క‌లెక్ష‌న్లప‌రంగా దూసుకుపోతోంది.

సంక్రాంతి సెలవులు పొడ‌గించ‌డంతో సోమ‌వారం కూడా బంగార్రాజు క‌లెక్ష‌న్లు స్ట‌డీగా కొన‌సాగాయి. ఈ సినిమా కేవ‌లం మూడు రోజుల్లోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 50 కోట్ల‌కు పైగా వసూళ్లు చేసిన‌ట్లు స‌మాచారం. ఇక రానున్న రోజుల్లో కూడా పెద్ద సినిమా ఏదీ విడుద‌ల‌కు సిద్ధంగా లేక‌పోవ‌డంతో మరికొన్ని రోజులు బంగార్రాజు హ‌వా కొన‌సాగే అవ‌కాశాలు ఉన్నాయి. దీంతో క‌లెక్ష‌న్లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక చిత్ర యూనిట్ కూడా త్వ‌ర‌లోనే స‌క్సెస్ మీట్ నిర్వ‌హించే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Also Read: IOCL Recruitment: ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. చివ‌రి తేదీ ఎప్పుడంటే..

మీరు ప్రయాణించాల్సిన రైలు ఎక్కడుందో తెలుసుకోవాలా..? ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు

Punjab Elections 2022: పంజాబ్‌లో సీఎం అభ్యర్థిపై క్లారిటీ ఇచ్చేసిన కాంగ్రెస్.. ఆసక్తిరేపుతున్న వీడియో

మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకుంటున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకుంటున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!