NIA Recruitment: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో ఉద్యోగాలు.. నెలకు రూ. 90 వేలకిపైగా జీతం పొందే అవకాశం
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 44 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే సంబంధిత ఫీల్డ్‌లో రెగ్యులర్ ప్రాతిపదికన రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 56 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు నెలకు రూ. 29,200 నుంచి రూ. 92,300 అందిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 13-06-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.
* ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..