AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS EAMCET: ఈసారి ఎంసెట్‌కు భారీగా పెరిగిన దరఖాస్తులు.. ఎన్ని అప్లికేషన్స్‌ వచ్చాయంటే..

ఈ ఏడాది తెలంగాణ ఎంసెట్‌కు భారీగా దరఖాస్తులు పెరిగాయని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది ఎంసెట్‌ ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు...

TS EAMCET: ఈసారి ఎంసెట్‌కు భారీగా పెరిగిన దరఖాస్తులు.. ఎన్ని అప్లికేషన్స్‌ వచ్చాయంటే..
TS EAMCET
Narender Vaitla
|

Updated on: May 02, 2023 | 3:34 PM

Share

ఈ ఏడాది తెలంగాణ ఎంసెట్‌కు భారీగా దరఖాస్తులు పెరిగాయని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది ఎంసెట్‌ ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది ఎంసెట్‌కు అదనంగా 50వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇప్పటికే 2లక్షలకు పైగా విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారని పేర్కొన్నారు.

పెరిగిన దరఖాస్తుల నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను పెంచుతున్నట్లు లింబాద్రి తెలిపారు. ఎంసెట్‌కు 28 కొత్తవి సహా మొత్తం 137 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి, ఆలస్యమైతే అనుమతించేది లేదని తెలిపారు. లాసెట్ ఒకే రోజు మూడు సెషన్స్‌లో నిర్వహిస్తామని, ఈసెట్ ఒకే పూటలో పూర్తి చేసేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇక ప్రైవేట్‌ యూనివర్సిటీల బిల్లు ప్రాసెస్‌లో ఉందని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే జేఎన్‌టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది కొత్తగా బయోటెక్నాలజీ కోర్సు ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. కొత్త కోర్సుల కోసం ప్రైవేట్‌ కాలేజీల దరఖాస్తులు ఏఐసీటీఈ పరిశీలనలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. కాలేజీల్లో తనిఖీలు మరో నాలుగైదు రోజుల్లో పూర్తవుతాయని వీసీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. మే 10 నుంచి 14 వరకు ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఇంజినీరింగ్‌ పరీక్షలు జరగనున్నాయి. మే 10, 11న అగ్రికల్చర్‌, మెడికల్‌.. 12, 13, 14 తేదీల్లో ఇంజినీరింగ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
హామిల్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ..
హామిల్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ..
పిల్లలకు పట్టుదల విలువను తెలిపే నీతికథ.. కుందేలు, కోతి, తాబేలు కథ
పిల్లలకు పట్టుదల విలువను తెలిపే నీతికథ.. కుందేలు, కోతి, తాబేలు కథ
గోవా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..
గోవా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..
చలికాలంలో కళ్ల మంట, దురద, నీళ్లు వస్తున్నాయా? ఇలా కాపాడుకోండి
చలికాలంలో కళ్ల మంట, దురద, నీళ్లు వస్తున్నాయా? ఇలా కాపాడుకోండి
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్నొచ్చాయంటే?
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్నొచ్చాయంటే?
దీపావళి తర్వాత దగ్గు వేధిస్తోందా? ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దు
దీపావళి తర్వాత దగ్గు వేధిస్తోందా? ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దు
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ రిసిపీ..ఇలా చేస్తే ఇష్టంగా తింటారు
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ రిసిపీ..ఇలా చేస్తే ఇష్టంగా తింటారు
కళ్లముందే కుప్పకూలిన మనిషి.. చుట్టూ జనం ఉన్నా దక్కని సాయం..
కళ్లముందే కుప్పకూలిన మనిషి.. చుట్టూ జనం ఉన్నా దక్కని సాయం..
అరుదైన ఘనత.. ముఖంపై మచ్చ లేకుండానే పుర్రె అడుగున కణితి తొలగింపు!
అరుదైన ఘనత.. ముఖంపై మచ్చ లేకుండానే పుర్రె అడుగున కణితి తొలగింపు!
దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీలో 1700 దాటిన AQI.. హైదరాబాద్‌లో ఎంతంటే?
దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీలో 1700 దాటిన AQI.. హైదరాబాద్‌లో ఎంతంటే?