NHM Jobs in Telangana: నేరుగా ఇంటర్వ్యూ ద్వారా.. తెలంగాణలో 29 మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే
నేషనల్ హెల్త్ మిషన్ (NHM) తెలంగాణ రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్, డిస్ట్రిక్ట్ అకౌంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...
NHM Telangana Recruitment 2022: నేషనల్ హెల్త్ మిషన్ (NHM) తెలంగాణ రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ (outsourcing jobs)ప్రాతిపదికన డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్(DDM), డిస్ట్రిక్ట్ అకౌంట్ మేనేజర్ (DAM) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీలు: 29
1. డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ (DDM) పోస్టులు: 23
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం ఏడాదిపాటు పని అనుభవం కూడా ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 34 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: రూ. 30,000లు జీతంగా చెల్లిస్తారు.
2. డిస్ట్రిక్ట్ అకౌంట్ మేనేజర్ (DAM) పోస్టులు: 6
అర్హతలు: ఎంబీఏ (ఫైనాన్స్)/ఎంకాం ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ నైపుణ్యం, సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 34 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: రూ. 25,000లు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 10, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: