Teacher Jobs Hyderabad: ప్రైమరీ, టీజీటీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఫిబ్రవకి 11

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో ఉన్నఅటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ (AECS Hyderabad) తాత్కాలిక ప్రాతిపదికన టీజీటీ, ప్రైమరీ టీచర్ పోస్టుల (TGT, Primary Teacher Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

Teacher Jobs Hyderabad: ప్రైమరీ, టీజీటీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఫిబ్రవకి 11
Teacher Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 31, 2022 | 9:56 AM

AECS Hyderabad Recruitment 2022: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో ఉన్నఅటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ (AECS Hyderabad) తాత్కాలిక ప్రాతిపదికన టీజీటీ, ప్రైమరీ టీచర్ పోస్టుల (TGT, Primary Teacher Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల వివరాలు: టీచర్ పోస్టులు

1. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ)

సబ్జెక్ట్స్: ఇంగ్లీష్, సోషల్ సైన్సెస్, హిందీ/సంస్కృతం, గణితం, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజికల్ ఎడ్యకేషన్ టీచర్, ఆర్ట్ టీచర్.

అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఈడీ ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్: రూ. 26,250లు జీతంగా చెల్లిస్తారు.

2. ప్రైమరీ టీచర్లు

అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌తోపాటు డిప్లొమా ఎన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్: రూ. 21,250లు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: principal co-ordination, atomic energy central school-2, DAE colony, ECIL post, hyderabad, telangana- 500062

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 11, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Hyderabad Jobs: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రూ.75 వేల వరకు జీతం.. పూర్తివివరాలివే!