NHB Recruitment: నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు.? ఎలా ఎంపిక చేస్తారంటే..?
నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉండే ఈ బ్యాంక్ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 27 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల్లో కొన్ని కాంట్రాక్ట్, మరికొన్ని రెగ్యులర్ విధానంలో తీసుకోనున్నారు...
నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉండే ఈ బ్యాంక్ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 27 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల్లో కొన్ని కాంట్రాక్ట్, మరికొన్ని రెగ్యులర్ విధానంలో తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 27 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో చీఫ్ ఎకనామిస్ట్ (01), ప్రోటోకాల్ ఆఫీసర్ (02), డిప్యూటీ జనరల్ మేనేజర్ (స్కేల్-6) (01), అసిస్టెంట్ మేనేజర్(స్కేల్-1)- జనరల్/ హిందీ (16), ఆఫీసర్(సూపర్‌విజన్) (06), రీజినల్ మేనేజర్ (స్కేల్-4)- కంపెనీ సెక్రటరీ (01) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, సీఎంఏ, సీఎస్, సీఎఫ్‌ఏ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఎస్సీ, ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ. 175 చెల్లించాలి, ఇతరులు రూ. 850 చెల్లించాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్ పరీక్షణలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 18-11-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* ఆన్‌లైన్ పరీక్షను ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో నిర్వహిస్తారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..