NEET UG 2025 Toppers List: నీట్ యూజీ ఫలితాల్లో సత్తా చాటిన అబ్బాయిలు.. టాప్ ర్యాంకులన్నీ వారివే! వెనుక బడిన తెలుగోళ్లు..
తాజాగా విడుదలైన నీట్ యూజీ 2025 ఫలితాల్లో టాప్ 10 ర్యాంకులు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, పంజాబ్, మహారాష్ట్రకు చెందిన జనరల్ కేటగిరీ అభ్యర్థులు మాత్రమే దక్కించుకున్నారు. ఈ ఫలితాల్లో టాప్ 10 ర్యాంకుల్లో ఒక్క తెలుగు విద్యార్ధికి కూడా చోటు దక్కలేదు. అయితే టాప్ 100లో తెలంగాణ విద్యార్థులు పలు ర్యాంకులు సాధించారు..

హైదరాబాద్, జూన్ 15: మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ 2025 పరీక్ష ఫలితాలు శనివారం (జూన్ 14 )విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో రాజస్థాన్‌కు చెందిన మహేష్ కుమార్ 99.9999547 పర్సంటైల్ స్కోరుతో దేశంలోనే ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌కు చెందిన ఉత్కర్ష్ అవధియా 99.9999095 పర్సెంటేల్‌తో సెకండ్ ర్యాంకు, మహారాష్ట్రకు చెందిన కృషాంగ్ జోషి 99.9998189 పర్సెంటేల్‌తో థార్డ్ ర్యాంకు కైవసం చేసుకున్నారు. టాప్ 10 ర్యాంకుల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, పంజాబ్, మహారాష్ట్రకు చెందిన జనరల్ కేటగిరీ అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. ఈ ఫలితాల్లో టాప్ 10 ర్యాంకుల్లో ఒక్క తెలుగు విద్యార్ధికి కూడా చోటు దక్కలేదు. అయితే టాప్ 100లో తెలంగాణ విద్యార్థులు పలు ర్యాంకులు సాధించారు. టాప్10 ర్యాంకర్లందరూ జనరల్ కేటగిరీకి చెందిన వారేకావడం మరో విశేషం. టాప్ 10లో ఢిల్లీకి చెందిన అవికా అగర్వాల్ అనే అమ్మాయి 99.9996932 పర్సెంటేల్‌తో టాప్ 5 ర్యాంకు సాధించింది. టాప్ 10లో మిగతా అందరూ అబ్బాయిలే. టాప్ 10లో మిగతా అందరూ అబ్బాయిలే. నీట్ యూజీ పరీక్ష 720 మార్కులకు నిర్వహించగా.. గతేడాది 17 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించారు. అయితే ఈసారి ఒక్కరు కూడా 720 మార్కులు సాధించలేదు.
నీట్ యూజీ 2025 ఫలితాల్లో టాప్ 100లో ర్యాంకులు దక్కించుకున్న తెలుగు విద్యార్ధులు వీరే..
- జీవన్ సాయికుమార్ 18వ ర్యాంక్
- షణ్ముఖ నిషికాంత్ అక్షింతల 37వ ర్యాంక్
- ఎం.వరుణ్ 46వ ర్యాంక్
- వై షణ్ముఖ్ 48వ ర్యాంక్
- విదిశా మాజీ 95వ ర్యాంక్
- కార్తీక్ రామ్ కిరీటి 19వ ర్యాంక్
- కొడవటి మోహిత్ శ్రీరామ్ 56వ ర్యాంక్
- దేశిన సూర్య చరణ్ 59వ ర్యాంక్
- పి అవినాశ్ 64వ ర్యాంక్
- వై సమీర్ కుమార్ 70వ ర్యాంక్
- టి శివమణి 92వ ర్యాంక్
ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 22.09 లక్షల మంది విద్యార్ధులు నీట్-యూజీ పరీక్ష రాయగా అందులో 12.36 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో అమ్మాయిలు 7.2 లక్షల మందికిపైగా ఉండగా, అబ్బాయిలు 5.14 లక్షల మంది ఉన్నారు. తెలంగాణ నుంచి 70,259 మంది పరీక్ష రాయగా.. ఇందులో 41,584 మంది అంటే 59.18 శాతం మంది అర్హత సాధించారు. 2024లో నీట్ పరీక్షకు హాజరైన వారి సంఖ్య 77,848 మంది కాగా 47,356 మంది అర్హత సాధించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి పరీక్ష రాసిన వారి సంఖ్య, అర్హత పొందిన వారి శాతం కాస్త తగ్గడం తగ్గింది. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి 57,934 మంది నీట్- యూజీ పరీక్ష రాయగా.. ఇందులో 36,776 మంది అంటే 63.48 శాతం మంది అర్హత సాధించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.
