AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET UG MBBS కౌన్సెలింగ్‌ అభ్యర్థులకు కీలక సూచనలు.. ‘ఎక్కువ ఆప్షన్లు పెట్టుకోండి’

ఈ ఏడాది నీట్‌ యూజీ ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌లో అభ్యర్థులు తమకు నచ్చిన కళాశాలల విషయంలో ఎక్కువ సంఖ్యలో ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు సూచించారు. పరిమిత సంఖ్యలో కళాశాలలను మాత్రమే ఎంచుకుంటే ఓపెన్‌ కేటగిరీలో సీట్లు పొందే అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని తెలిపారు..

NEET UG MBBS కౌన్సెలింగ్‌ అభ్యర్థులకు కీలక సూచనలు.. 'ఎక్కువ ఆప్షన్లు పెట్టుకోండి'
NEET UG MBBS Counselling
Srilakshmi C
|

Updated on: Sep 10, 2026 | 7:46 AM

Share

అమరావతి, సెప్టెంబర్ 10: విజయవాడలోని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ పి. చంద్రశేఖర్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సాయి సుధీర్‌ ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌కు సంబంధించి అభ్యర్థుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి మొత్తం 4,581 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉండగా, ఇప్పటివరకు 4,321 సీట్లు భర్తీ అయినట్లు అధికారులు తెలిపారు. అయితే సీట్లు పొందిన వారిలో 90 మంది ఆయా కళాశాలల్లో చేరలేదని వెల్లడించారు. ప్రస్తుతం జాతీయ కోటా రెండో దశ కౌన్సెలింగ్‌ సెప్టెంబర్‌ 11 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో రెండో విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి ఆప్షన్ల నమోదు నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని చెప్పారు.

సెప్టెంబర్‌ 15 నుంచి MBBS తరగతులు

ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం తరగతులు సెప్టెంబర్‌ 15 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియలో అభ్యర్థులు సమయానికి ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. కౌన్సెలింగ్‌లో కొంతమంది అభ్యర్థులకు వారి ర్యాంకులకు అనుగుణంగా కళాశాలలు కేటాయించలేదంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అధికారులు స్పష్టం చేశారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో రిజర్వేషన్‌ కేటగిరీలకు చెందిన కొంతమంది అభ్యర్థులు పరిమిత సంఖ్యలో మాత్రమే కళాశాలల ఆప్షన్లు ఇచ్చారని వివరించారు. దీంతో వారు నమోదు చేసిన ఆప్షన్ల పరిధిలోనే, రిజర్వేషన్‌ దామాషా ప్రకారం సీట్లు కేటాయించినట్లు తెలిపారు. అందువల్ల అన్ని కళాశాలలను తమ ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లుగా నమోదు చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు.

ఇవి కూడా చదవండి

ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 102ను పారదర్శకంగా అమలు చేస్తున్నామని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు స్పష్టం చేశారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియపై అభ్యర్థులు అనవసరమైన సందేహాలు పెట్టుకోవద్దని తెలిపారు. అభ్యర్థులు తమకు నచ్చిన కళాశాలలతో పాటు అందుబాటులో ఉన్న ఇతర కళాశాలల ఆప్షన్లను కూడా నమోదు చేసుకోవడం ద్వారా సీటు పొందే అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని అధికారులు సూచించారు. అభ్యర్థులు కౌన్సెలింగ్‌ సమయంలో ఆప్షన్లను జాగ్రత్తగా నమోదు చేసుకోవడంతో పాటు అధికారికంగా విడుదలయ్యే నోటిఫికేషన్‌లోని నిబంధనలు, సీట్ల వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలి.

Follow Us
NEET UG MBBS కౌన్సెలింగ్‌ అభ్యర్థులకు కీలక సూచనలు..
NEET UG MBBS కౌన్సెలింగ్‌ అభ్యర్థులకు కీలక సూచనలు..
రోహిత్ శర్మకు రీప్లేస్ మెంట్స్ వచ్చేశార్రోయ్..!
రోహిత్ శర్మకు రీప్లేస్ మెంట్స్ వచ్చేశార్రోయ్..!
SIR సిత్రాలు.. భారతరత్న సైంటిస్టుకు నోటీసులు! అసలేం జరిగిందంటే?
SIR సిత్రాలు.. భారతరత్న సైంటిస్టుకు నోటీసులు! అసలేం జరిగిందంటే?
దులీప్ ట్రోఫీ 2026 విజేత దక్కించుకునే ప్రైజ్ మనీ ఎంతంటే?
దులీప్ ట్రోఫీ 2026 విజేత దక్కించుకునే ప్రైజ్ మనీ ఎంతంటే?
ఇకపై ఏసీ బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం.. మహిళలకు పండుగే..
ఇకపై ఏసీ బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం.. మహిళలకు పండుగే..
గుడ్‌న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు మరో 3 ఏళ్లు వయో సడలింపు!
గుడ్‌న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు మరో 3 ఏళ్లు వయో సడలింపు!
టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం
టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం
పొద్దున్నే ఒక గుడ్డు తింటే 100 ఏనుగుల బలం.. పెంకు ఈజీగా రావాలంటే
పొద్దున్నే ఒక గుడ్డు తింటే 100 ఏనుగుల బలం.. పెంకు ఈజీగా రావాలంటే
డెలివరీ బాయ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..
డెలివరీ బాయ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..
త్రిగుణ్ ఆ బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్‌కు దగ్గరి బంధువా?
త్రిగుణ్ ఆ బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్‌కు దగ్గరి బంధువా?