NEET UG 2024 Notification: నీట్ యూజీ 2024 నోటిఫికేషన్ విడుదల.. సిలబస్‌లో స్వల్ప మార్పులు
దేశవ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి గానూ వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ - యూజీ (నీట్ యూజీ 2024) పరీక్ష నోటిఫికేషన్ శుక్రవారం (ఫిబ్రవరి 9) విడుదలైంది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ వంటి బ్యాచిలర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎన్‌టీఏ ప్రతీయేట నీట్ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది నీట్ పరీక్షను మే 5న నిర్వహించనున్నట్టు..
దేశవ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి గానూ వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ – యూజీ (నీట్ యూజీ 2024) పరీక్ష నోటిఫికేషన్ శుక్రవారం (ఫిబ్రవరి 9) విడుదలైంది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ వంటి బ్యాచిలర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎన్‌టీఏ ప్రతీయేట నీట్ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది నీట్ పరీక్షను మే 5న నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నోటిఫికేషన్‌లో ప్రకటించింది. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. పెన్ను, పేపర్ విధానంలో ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. నీట్ యూజీ సిలబస్‌లోనూ స్పల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. నీట్ యూజీ-2024 నూతన సిలబస్‌కు సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో చేసిన మార్పుల వివరాలను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) తాజాగా ప్రకటించింది.
నీట్ యూజీ పరీక్షకు హాజరయ్యే వారు తప్పనిసరిగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/ బయోటెక్నాలజీతో సైన్స్‌లో ఇంటర్మీడియట్ లేదా ప్రీ-డిగ్రీ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 17 ఏళ్లు నిండి ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.1,700, జనరల్ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ-ఎన్‌సీఎల్ అభ్యర్థులు రూ.1600, ఎస్సీ, ఎస్టీ / దివ్యాంగులు / థర్డ్ జండర్ అభ్యర్థులు రూ.1000ల చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులకు మార్చి 9, 2024వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్, పరీక్ష కేంద్రాలు, పరీక్ష విధానం వంటి ఇతర వివరాలకు సంబంధించిన సమాచారాన్ని తర్వాత వెల్లడించనున్నారు.
నీట్ యూజీ 2024 నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేయండి.
నీట్ యూజీ 2024 సిలబస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.