TSPSC: గ్రూప్ 4 ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
అభ్యర్థులు టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో ర్యాంకులు చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి వివరాలు త్వరలో వెల్లడిస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఇదిలా ఉంటే తెలంగాణలో గ్రూప్-4 సర్వీసుల్లో 8,180 పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష...
తెలంగాణలో గతేడాదిలో నిర్వహించిన గ్రూప్ – 4 పరీక్షలకు సంబంధంచి ఫలితాలను విడుదల చేశారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిజల్ట్స్‌ను విడుదల చేసింది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల ర్యాంకుల వివరాలను అధికారులు విడుదల చేశారు.
అభ్యర్థులు టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో ర్యాంకులు చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి వివరాలు త్వరలో వెల్లడిస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఇదిలా ఉంటే తెలంగాణలో గ్రూప్-4 సర్వీసుల్లో 8,180 పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2) గతేడాది జులై 1న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 80శాతం మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. గతేడాది జూలైలో నిర్వహించిన ఈ పరీక్షలో 7,62,872 మంది పేపర్-1 రాశారు. 7,61,198 మంది పేపర్ -2 పరీక్ష రాశారు. టీఎస్‌పీఎస్సీ ఫైనల్ కీ కూడా విడుదల చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..