TG MBBS Counselling 2024: ఎట్టకేలకు పట్టాలెక్కిన ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ప్రక్రియ.. రేపట్నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం
తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది. రేపట్నుంచి (సెప్టెంబర్ 26) నుంచి మొదటి రౌండ్ అడ్మిషన్లకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నారు. సెప్టెంబర్ 24న కన్వీనర్ కోటా సీట్ల కోసం మొత్తం 16,679 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు ప్రాథమిక మెరిట్ జాబితాను కాళోజీ ఆరోగ్య యూనివర్సిటీ..
హైదరాబాద్, సెప్టెంబర్ 25: తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది. రేపట్నుంచి (సెప్టెంబర్ 26) నుంచి మొదటి రౌండ్ అడ్మిషన్లకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నారు. సెప్టెంబర్ 24న కన్వీనర్ కోటా సీట్ల కోసం మొత్తం 16,679 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు ప్రాథమిక మెరిట్ జాబితాను కాళోజీ ఆరోగ్య యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ జాబితాపై అభ్యంతరాలుంటే సెప్టెంబర్ 25 సాయంత్రం ఐదు గంటల్లోపు వెబ్‌సైట్ ద్వారా తెలియజేయాలని కాళోజీ వర్సిటీ వైస్ ఛాన్సలర్ బి కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ముగింపు సమయంలోపు వచ్చే అభ్యంతరాల పరిశీలన అనంతరం సెప్టెంబర్ 26వ తేదీన తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. ఇక అదేరోజు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. ఈ మేరకు విద్యార్ధులు అడ్మిషన్ ప్రక్రియలో పాల్గొనాలని సూచించారు. గత ఏడాదికి సంబంధించిన సీట్ల కేటాయింపు వివరాలు కాలేజీల వారీగా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు.
కాగా రాష్ట్రంలోని 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 4,090 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వాటిలో 15 శాతం సీట్లు ఆలిండియా కోటాలో భర్తీ అవుతాయి. మిగిలిన అన్ని సీట్లు రాష్ట్ర విద్యార్థులకు కౌన్సెలింగ్‌లో అందుబాటులో ఉంటాయి. ఇక ప్రైవేట్ కాలేజీల్లో మరో 4,810 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సగం కన్వీనర్ కోటాలో భర్తీ అవుతాయి. మిగిలినవి బీ, సీ కేటగిరీ సీట్లుగా అందుబాటులో రానున్నాయి.
స్థానికతపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రవేశాలు
ఇంటర్‌కు ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివితే మాత్రమే స్థానికులుగా గుర్తించేలా జారీ చేసిన జీవో 33పై కొందరు విద్యార్ధులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారి స్థానికతకు సంబంధించిన మార్గదర్శకాలను కొత్తగా రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఇంటర్ తర్వాత నాలుగేళ్లు రాష్ట్రంలో చదవకపోయినా అనుమతిస్తున్నట్లు అత్యున్నత ధర్మాసనం ఎదుట రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు గత సెప్టెంబర్ 27 కౌన్సెలింగ్ ప్రక్రియకు అనుమతిస్తూ, కోర్టును ఆశ్రయించిన 135 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పించినట్లైంది. సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయశాఖ సమీక్ష, సూచనల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కౌన్సెలింగ్‌కు అనుమతించింది. ఈ నేపథ్యంలో కోర్టును ఆశ్రయించిన 135 మంది విద్యార్థుల మెరిట్ జాబితాను ప్రత్యేకంగా విడుదల చేసింది.