TG AEE Posts: రేపు 700 మంది ఏఈఈలకు సీఎం రేవంత్‌ చేతుల మీదగా నియామక పత్రాలు అందజేత

తెలంగాణ నీటిపారుదల శాఖలో కొత్తగా ఎంపికైన 700 మంది అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి చేతుల మీదగా సెప్టెంబరు 26 సాయంత్రం నియామకపత్రాలు అందజేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో ఉన్న జలసౌధలో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఏఈఈలతోపాటు మరో 1800 మంది లస్కర్లకు కూడా నియామకపత్రాలు..

TG AEE Posts: రేపు 700 మంది ఏఈఈలకు సీఎం రేవంత్‌ చేతుల మీదగా నియామక పత్రాలు అందజేత
CM Revanth Reddy
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 25, 2024 | 2:56 PM

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 25: తెలంగాణ నీటిపారుదల శాఖలో కొత్తగా ఎంపికైన 700 మంది అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి చేతుల మీదగా సెప్టెంబరు 26 సాయంత్రం నియామకపత్రాలు అందజేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో ఉన్న జలసౌధలో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఏఈఈలతోపాటు మరో 1800 మంది లస్కర్లకు కూడా నియామకపత్రాలు అందజేయనున్నారు. దీంతోపాటు ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టులపై ఏర్పాటు చేయనున్న ప్రజంటేషన్‌ కార్యక్రమానికి సీఎం హాజరు అవుతారు. అనంతరం ఈఎన్సీలు, సీఈ, ఎస్‌ఈ, ఈఈ, డిప్యూటీ ఈఈ, ఏఈలతో నీటిపారుదల శాఖ ఏర్పాటు చేయనున్న వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ మాట్లాడుతారు.

తెలంగాణ ఐసెట్‌ 2024 కౌన్సెలింగ్‌లో 90 శాతం సీట్ల భర్తీ.. సెల్ఫ్‌ రిపోర్టింగ్‌కు గడువు ఇదే

తెలంగాణ ఐసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ పూర్తైంది. కన్వీనర్‌ కోటాలో మొత్తం ఎంబీఏ, ఎంసీఏ సీట్లలో 90.20 శాతం మేరక సీట్లు భర్తీ అయ్యాయి. ఐసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌లో సీట్లను మంగళవారం కేటాయించారు. ఎంబీఏలో 28,345 సీట్లలో 25,747 మంది, ఎంసీఏలో 6,966 సీట్లలో 6,095 మందికి సీట్లు కేటాయించినట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ శ్రీదేవసేన తెలిపారు. సీట్లు పొందినవారు సెప్టెంబర్‌ 27వ తేదీలోపు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 28వ తేదీలోగా ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయడంతోపాటు ఆయా కాలేజీలకు హాజరవ్వాలని సూచించారు. కాలేజీల్లో సీట్లు వద్దనుకునే వారు సెప్టెంబర్‌ 27లోపు ఆన్‌లైన్‌ ద్వారా సీట్లు రద్దు చేసుకోవచ్చని తెలిపారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్